Sunday, November 3, 2024

ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రాణ నష్టం కలగకూడదు

- Advertisement -
- Advertisement -

CS Somesh Kumar Teleconference with District Collectors

భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో సిఎస్ సోమేశ్ కుమార్ టెలీ కాన్ఫరెన్స్

హైదరాబాద్: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో చేపట్టాల్సిన జాగ్రత్తలపై జిల్లా కలెక్టర్లతో శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయనతో పాటు విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ ఈ టెలీ కాన్ఫరెన్స లో ఉన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలపై ఈ టెలీ కాన్ఫరెన్స్ లో సిఎస్ మాట్లాడుతూ… రానున్న రెండు రోజుల్లోభారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించినందున జిల్లాకలెక్టర్లు అప్రమత్తతతో ఉండాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణ నష్టం ఏర్పడకుండా చర్యలు చేపట్టాలి. వరుసగా రెండు రోజులు సెలవు రోజులు వస్తున్నందున, సెలవులను ఉపయోగించకుండా పునరావాస కార్యక్రమాలలో పాల్గొనాలని ఆదేశించారు. పొరుగు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నందున వరదలు అధికంగా వచ్చే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే పూర్తి స్థాయిలో అన్ని రిజర్వాయర్లు, చెరువులు పూర్తిగా నిండినందున చెరువులు, కుంటలకు గండ్లు పడకుండా జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. ఎక్కడైతే రహదారులు, బ్రిడ్జిలు తెగాయో, ఆమార్గాల్లో ప్రమాదాలు జరగకుండా వాహనాలను, ప్రయాణకులను నిలిపి వేయాలని పేర్కొన్నారు. పోలీసు, నీటి పారుదల, రోడ్లు భవనాలు, విధ్యుత్, రెవిన్యూ తదితర శాఖల లన్నీ మరింత సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News