Sunday, December 22, 2024

సహాయ, పునరావాస కార్యక్రమాలపై సిఎస్ టెలీ కాన్ఫరెన్స్

- Advertisement -
- Advertisement -

CS Somesh Kumar teleconference with senior officials

సహాయ, పునరావాస కార్యక్రమాలపై
జిల్లా కలెక్టర్, ఇతర సీనియర్ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్

హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు భారీ వర్షాలు, వరదల వల్ల తీవ్రంగా ప్రభావితమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరుగుతున్న సహాయ, పునరావాస కార్యక్రమాలపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్, ఇతర సీనియర్ అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మంగళవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ టెలీకాన్ఫరెన్స్ లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ తోపాటు మున్సిపల్ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, విపత్తుల నివారణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయితీ రాజ్ శాఖ డైరెక్టర్ హనుమంత రావు, ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News