Friday, January 10, 2025

రాష్ట్రపతి పర్యటనకు ఏర్పాట్లు ముమ్మరం

- Advertisement -
- Advertisement -

CS Someshkumar talking to the officers

హైదరాబాద్ : ముచ్చింతల్‌లో రాష్ట్రపతి పర్యటనకు అన్ని శాఖలతో సమన్వయం చేసుకోవాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ ఆదేశించారు. గురువారం బిఆర్‌కెఆర్ భవన్‌లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమన్వయ సమావేశాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముచ్చింతల్ మార్గంలో రాకపోకలు సాగించేలా బారికేడింగ్‌తో రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలని ఆర్‌అండ్‌బి అధికారులను ఆదేశించారు. ముచ్చింతల్‌లో నిరంతర విద్యుత్ సరఫరా, వైద్య బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్రపతి పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ, హోంశాఖ ముఖ్యకార్యదర్శి రవిగుప్తా, ముఖ్య కార్యదర్శులు వికాస్‌రాజ్ , రిజ్వీ, నగర పోలీస్ కమిషనర్ సి వి ఆనంద్, జిహెచ్‌ఎంసి కమిషనర్ లోకేష్‌కుమార్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, కలెక్టర్లు శర్మన్, అమోయ్‌కుమార్, హరీష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News