Thursday, January 23, 2025

పోచమ్మ ఆలయంలో సిఎస్ ప్రత్యేక పూజలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : సచివాలయ సముదాయంలో నూతనంగా నిర్మించిన నల్ల పోచమ్మ ఆలయంలో జరిగిన పూజల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పాల్గొన్నారు. గురువారం రాష్ట్ర సచివాలయ సంఘం అధ్యక్షులు మాధవరం నరేందర్‌రావు దంపతులు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సచివాలయ సముదాయం ప్రాగంణంలో నిర్మించిన దేవాలయం, మసీదు, చర్చి ప్రారంభోత్సవ ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పర్యవేక్షించారు. శుక్రవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖ రావు ప్రార్థనా మందిరాలను ప్రారంభించనున్నారు. రోడ్లు, భవనాలు, పోలీస్ తదితర శాఖల అధికారులతో కలసి సిఎస్ ఏర్పాట్లును పర్యవేక్షించారు.ఈ పర్యటనలో రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస్ రాజు, ఆర్థిక శాఖ కార్యదర్శి టికె శ్రీదేవి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News