న్యూఢిల్లీ : శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధన మండలి (సిఎస్‌ఐఆర్) డైరెక్టర్ జనరల్‌గా సీనియర్ సైంటిస్టు నల్లతంబి కలైసెల్వి నియమితులయ్యారు. ఈ పదవిని చేపట్టిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. ఏప్రిల్‌లో పదవీ విరమణ చేసిన శేఖర్ మండే స్థానంలో ఆమె నియమితులయ్యారు. సీఎస్‌ఐఆర్ మన దేశం లోని 38 పరిశోధన సంస్థల కన్సార్టియం. నల్లతంబి కలైసెల్వి తమిళనాడు లోని కరైకుడిలో ఉన్న సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆమె సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ డిపార్టుమెంట్ కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తారు. కలైసెల్వి సీఎస్‌ఐఆర్ డైరెక్టర్ జనరల్ పదవీకాలం రెండేళ్లు. సీఎస్‌ఐఆర్‌లో ఎంట్రీ లెవెల్ సైంటిస్ట్‌గా ఆమె కెరీర్ ప్రారంభమైంది. తమిళనాడు లోని తిరునల్వేలి జిల్లా అంబ సముద్రంలో జన్మించిన నల్లతంబి తమిళ మాధ్యమంలో చదివారు. తాను తమిళంలో చదవడం వల్ల కళాశాలలో సైన్స్ భావనలను అర్ధం చేసుకోగలిగానని చెబుతూ ఉంటారు. ఆమె 125 పరిశోధన పత్రాలను సమర్పించారు. ఆరు పేటెంట్లను పొందారు. లిథియం అయాన్ బ్యాటరీస్ రంగంలో విశేష కృషి చేశారు.
సీఎస్‌ఐఆర్ తొలి మహిళా డైరెక్టర్ జనరల్‌గా నల్లతంబి కలైసెల్వి రికార్డు
- Advertisement -
- Advertisement -
- Advertisement -