Friday, November 22, 2024

దర్జాగా ఫైనల్‌కు చేరుకున్న చెన్నై సూపర్ కింగ్స్

- Advertisement -
- Advertisement -

తొలి క్వాలిఫయర్‌లో గుజరాత్ ఓటమి

చెన్నై: ఐపిఎల్ సీజన్16లో చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్‌కె) ఫైనల్‌కు దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన తొలి క్వాలిఫయర్‌లో చెన్నై 15 పరుగుల తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో ఓడినా గుజరాత్‌కు ఫైనల్ ఆశలు ఇంకా మిగిలేవున్నాయి. క్వాలిఫయర్2లో గెలిస్తే టైటాన్ ఫైనల్‌కు చేరుకుంటుంది. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డెవోన్ కాన్వేలు చెన్నైను ఆదుకున్నారు.

కీలక ఇన్నింగ్స్ ఆడిన కాన్వే 4 ఫోర్లతో 40 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 7 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 60 పరుగులు సాధించాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 87 పరుగులు జోడించారు. అయితే ఆ తర్వాత టైటాన్స్ బౌలర్లు రాణించడంతో చెన్నై స్కోరు 172 పరుగులకే పరిమితమైంది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 157 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. చెన్నై బౌలర్లు సమష్టిగా రాణించి జట్టును ఫైనల్‌కు చేర్చారు. ప్రత్యర్థి జట్టులో శుభ్‌మన్ గిల్ (42), రషీద్ ఖాన్ (30) మాత్రమే రాణించారు. మిగతా వారు విఫలం కావడంతో జట్టుకు ఓటమి తప్పలేదు. ఇక చెన్నై ఐపిఎల్‌లో రికార్డు స్థాయిలో పదోసారి ఫైనల్‌కు చేరుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News