Monday, January 20, 2025

గతేడాదే ఆ నిర్ణయం తీసుకున్నాం..

- Advertisement -
- Advertisement -

ముంబయి: ఐపిఎల్ 2021 సీజన్‌లో ధోనీ సారధ్యంలోని చెన్నై సూపర్స్ కింగ్స్ ఛాంపియన్‌గా నిలిచిన విషయం విధితమే. ఆ సమయంలోనే సిఎస్‌కె కెప్టెన్సీ పగ్గాలు రవీంద్ర జడేజాకు అప్పగించాలని ధోనీ అప్పుడే నిర్ణయించుకున్నాడని ఆ జట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తాజాగా చెప్పుకొచ్చాడు. శనివారం రాత్రి కోల్‌కతాతో జరిగిన తొలి మ్యాచ్‌లో చెన్నై ఓటమిపాలైంది. మ్యాచ్ అనంతరం ఫ్లెమింగ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘కెప్టెన్సీ మార్పు గురించి మేం గతేడాదే ఆలోచించాం. అప్పుడు చెన్నై గెలిచాక ధోనీ నాతో తన అభిప్రాయం తెలిపాడు. దీంతో జడేజాకు నాయకత్వం అప్పగించాలనే విషయంపై అన్ని విధాలా చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ విషయాన్ని చెన్నై యజమాని శ్రీనివాసన్‌కు కూడా తెలియజేశాం. ఇప్పుడు కెప్టెన్సీ మార్పు మా జట్టులో సజావుగానే సాగింది’ అని ఆయన పేర్కొన్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో చెన్నై ఓటమిపై స్పందించిన కోచ్.. ఇక్కడి పరిస్థితులను తాము సరిగ్గా అంచనా వేయలేకపోయామని, అలాగే ఆటగాళ్లు కాస్త తడబడినట్లు కూడా ఆతడు వెళ్లడించాడు. గతేడాది కూడా తమకు ఇలాంటి పరిస్థితులే ఎదురైనట్లు గుర్తు చేసుకున్నాడు.

CSK Coach Stephen Fleming about New Captain

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News