ముంబై: మహేంద్ర సింగ్ ధోని ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అతను మరో మూడేళ్ల పాటు ఐపిఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్‌కె)కు ప్రాతినిథ్యం వహించే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. ఈ అంశంపై సిఎస్‌కె యాజమాన్యం ఓ స్పష్టత ఇచ్చింది. మరో మూడేళ్ల పాటు ధోనిని అట్టిపెట్టుకుంటామనే సంకేతాలను వారు ఇచ్చారు. వచ్చే ఏడాది ఐపిఎల్‌లో పది జట్లు పాల్గొంటున్న విషయం తెలిసిందే. దీని కోసం డిసెంబర్‌లో మెగా వేలం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో నవంబర్ 30 నాటికి ప్రస్తుత జట్లు తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల వివరాలు అందించాలని బిసిసిఐ ఇప్పటికే ఆయా ఫ్రాంచైజీల యాజమాన్యాలకు సూచించింది.
దీనికి స్పందించిన సిఎస్‌కె యాజమాన్యం మరో మూడేళ్లు ధోని సిఎస్‌కెలో కొనసాగుతాడని స్పష్టం చేసినట్టు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ధోనితో పాటు రుతురాజ్ గైక్వాడ్, జడేజా, ఇంగ్లండ్ ఆల్‌రౌండర్లు మొయిన్ అలీ, శామ్ కరన్‌లలో ఒకరిని అట్టిపెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మతో పాటు జస్‌ప్రిత్ బుమ్రా, కీరన్ పొలార్డ్, ఇషాన్ కిషన్ లేదా సూర్యకుమార్‌లను అట్టిపెట్టుకోవాలనే ఉద్దేశంతో ఉన్నట్టు తెలిసింది.
CSK Likely to Retain MS Dhoni for 3 years