దుబాయి: ఐపిఎల్ రెండో దశ టోర్నమెంట్ ఎడాది గడ్డ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) సిద్ధమవుతోంది. మలి దశ టోర్నీ కోసం ఇప్పటికే పలు ఫ్రాంచైజీలు దుబాయి చేరుకున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, మాజీ విజేత చెన్నై సూపర్ కింగ్స్, కిందటి సీజన్ రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటికే యుఎఇ చేరుకున్నాయి. ముంబై, చెన్నై జట్లు క్వారంటైన్‌ను పూర్తి చేసుకుని సాధనను కూడా ఆరంభించాయి. ఇక ప్రధాన జట్ల రాకతో ఎడారి గడ్డపై క్రికెట్ సందడి కనిపిస్తోంది. ఈసారి అభిమానులకు కూడా అనుమతి ఇచ్చే అవకాశం ఉండడం, ఐపిఎల్ ముగిసిన వెంటనే యుఎఇలోనే టి20 వరల్డ్‌కప్ జరుగనుండడం గల్ఫ్ గడ్డపై కొన్ని నెలల పాటు వరుస క్రికెట్ జరుగనుంది. ఇక ఐపిఎల్‌తో పాటు పొట్టి క్రికెట్ జరుగుతుండడంతో యుఎఇలో ఒక్క సారిగా క్రికెట్ వాతావరణం ఏర్పడింది. భారత్‌తో పాటు పలువురు విదేశీ క్రికెటర్లు ఈసారి ఐపిఎల్‌లో సందడి చేయనున్నారు. కిందటి సీజన్ విజయవంతం కావడంతో ఈసారి మరింత పటిష్టంగా టోర్నీని నిర్వహించేందుకు యుఎఇ క్రికెట్ బోర్డు సన్నాహలు ఆరంభించింది. టోర్నీలో పాల్గొనే క్రికెటర్లకు, సహాయక సిబ్బందికి, అధికారులకు ఎలాంటి లోటు లేకుండా చూసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు భారత క్రికెట్ బోర్డు కూడా ఐపిఎల్‌పై ప్రత్యేక దృష్టి సారించింది.
CSK Players Begin Practice for IPL in Dubai