Monday, December 23, 2024

ప్లే ఆఫ్‌కు చెన్నై సూపర్ కింగ్స్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఐపిఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై 77 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. ఢిల్లీపై ఘన విజయం సాధించిన చెన్నై నాకౌట్‌కు అర్హత సాధించింది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో చెన్నై అద్భుత ఆటతో అదరగొట్టింది.

తొలుత బ్యాటింగ్‌లో తర్వాత బౌలింగ్‌లో చెన్నై సత్తా చాటిన సిఎస్‌కె అలవోక విజయంతో ప్లేఆఫ్ బెర్త్‌ను సొంతం చేసుకుంది. ఇక ఢిల్లీ ఇంతకుముందే నాకౌట్ రేసుకు దూరమైన విషయం తెలిసిందే. ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సిఎస్‌కె 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 223 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 146 పరుగులు మాత్రమే చేసి ఘోర పరాజయం చవిచూసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News