Sunday, April 13, 2025

చెన్నైకి చావోరేవో

- Advertisement -
- Advertisement -

నేడు కోల్‌కతాతో కీలక పోరు
చెన్నై: వరుస ఓటములతో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్‌కు శుక్రవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగే పోరు చావోరేవోగా మార నుంది. ఈ సీజన్‌లో చెన్నై ఐదు మ్యాచులు ఆడి నాలుగింటిలో పరాజయం చవిచూసింది. దీంతో చెన్నై ప్లేఆఫ్ అవకాశాలు క్లిష్టంగా మారాయి. ఈ నేపథ్యంలో ఇకపై జరిగే ప్రతి మ్యాచ్‌లో కూడా విజయం సాధించాల్సిన పరిస్థితి జట్టుకు నెలకొంది. గాయంతో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఈ సీజన్‌లోని మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అతని స్థానంలో సీనియర్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ సారథ్య బాధ్యతలు చేపట్టాడు.

అపార అనుభవజ్ఞుడైన ధోనీ మళ్లీ కెప్టెన్సీ స్వీకరించడంతో చెన్నై దశ తిరుగుతుందని అభిమానులు భావిస్తున్నారు. అయితే ఇప్పటికే నాలుగు మ్యాచుల్లో ఓటమి పాలు కావడంతో చెన్నై నాకౌట్ అవకాశాలు సన్నగిల్లాయి. మిగిలిన మ్యాచుల్లో భారీ తేడాతో విజయాలు సాధిస్తే తప్ప చెన్నై ముందు కు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. ఇలాంటి స్థితిలో అందరి కళ్లు కెప్టెన్ ధోనీపైనే నిలిచాయి. అతను జట్టును ఎలా ముందుకు తీసుకెళుతాడనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. మరోవైపు కోల్‌కతాకు కూడా ఈ మ్యాచ్ సవాల్‌గా తయారైంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి నైట్‌రైడర్స్ ఆశించిన స్థాయిలో రాణించలేక పోతోంది. ఇప్పటి వరకు ఐదు మ్యాచుల్లో రెండు విజయాలు మాత్రమే సాధించింది. దీంతో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో కనిపిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News