Wednesday, January 22, 2025

ధోనీపై స్టాలిన్, పిచాయ్ ప్రశంసల వర్షం

- Advertisement -
- Advertisement -

చెన్నై: చైన్నై సూపర్ కింగ్స్(సిఎస్‌కె) మరోసారి ఐపిఎల్ విజేతగా నిలబడింది. దాంతో సిఎస్‌కె జట్టుపై పొగడ్తల వర్షం కురిసింది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కూడా చెన్నై సూపర్ కింగ్స్ జట్టును అభినందించారు. స్టాలిన్ తన ట్విట్టర్ పోస్ట్‌లో ‘ప్రతీ సందర్భానికి తగ్గట్టుగా ప్రణాళికాబద్ధంగా నడుచుకునే ఎం.ఎస్. ధోనీ సారథ్యంలో ఐదో ఐపిఎల్ ట్రోఫీని గెలుచుకున్న సిఎస్‌కె ఎల్లో బ్రిగేడ్‌కు అభినందనలు. ఇది అత్యుత్తమ క్రికెట్. ప్రతికూల పరిస్థితుల్లో జడేజా సిఎస్‌కెకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు’ అని పేర్కొన్నారు. ధోనీకి ఎంకె. స్టాలిన్ కూడా బడా అభిమాని.

గూగుల్ సిఈవో సుందర్ పిచాయ్ కూడా చెన్నై టీమ్‌ను అభినందించారు. గుజరాత్ టైటాన్స్ వచ్చే ఏడాది బలంగా తిరిగొస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోస్ట్‌ను పిచాయ్ రీట్వీట్ చేశారు. జడేజా చివరి రెండు బంతులను అద్భుతమైన షాట్లుగా మలచడాన్ని ఐపిఎల్ తన ట్వీట్‌లో ప్రత్యేకంగా పేర్కొంది. రవీంద్ర జడేజా తనదైన స్టయిల్‌లో ఆటను ముగించాడంటూ పోస్ట్‌లో పేర్కొంది. దాన్నే పిచాయ్ షేర్ చేశారు. గమనించాల్సిన విషయం ఏమిటంటే సుందర్ పిచాయ్ స్కూల్, కాలేజ్ చదువంతా చెన్నైలోనే కొనసాగింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News