Wednesday, January 22, 2025

ఐపిఎల్ కప్ చెన్నైకే

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: ఐపిఎల్ ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. గుజరాత్ టైటాన్స్‌పై డక్‌వర్త్ లూయిస్ ప్రకారం ఐదు వికెట్ల తేడాతో సిఎస్‌కె గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాట్స్ మెన్లలో సాయి సుదర్శన్(96), సాహా(54), శుభ్ మన్ గిల్ (39), హార్ధిక్ పాండ్యా(21) పరుగులు చేయడంతో చెన్నై ముందు భారీ లక్ష్యాన్ని ఉంచారు. చెన్నై బ్యాట్స్ మెన్లలో దేవన్ కాన్వే(47), శివమ్ దూబే(32 నాటౌట్), అజింక్య రహానే(27), రుతూరాజ్ గైక్వాడ్(26), అంబటి రాయుడు(19), రవీంద్ర జడేజా(15) నాటౌట్ పరుగులు చేశారు. 215 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సిఎస్‌కె 15 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. భారీ వర్షం రావడంతో డక్‌వర్త్ లూయిస్ ప్రకారం చెన్నై ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ డేవన్ కాన్వేకు దక్కగా మ్యాన్ ఆఫ్ ది సిరీస్ శుభ్‌మన్ గిల్‌కు వరించింది. ధోనీ నాయకత్వంలో చెన్నై ఐదో ఐపిఎల్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News