Monday, December 23, 2024

చెన్నై ఘన విజయం

- Advertisement -
- Advertisement -

చెన్నై : ఐపిఎల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. మంగళవారం గుజరాత టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 63 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోరును సాధించింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (46), రచిన్ రవీంద్ర (46) జట్టుకు శుభారంభం అందించారు. రుతురాజ్ సమన్వయంతో బ్యాటింగ్ చేయగా, రచిన్ చెలరేగి ఆడా డు. తర్వాత వచ్చిన శివమ్ దూబే కూడా విధ్వంసక బ్యాటింగ్‌తో చెలరేగి పోయాడు. ప్రత్యర్థి బౌలర్లను హడలెత్తించిన శివమ్ దూబె 23 బంతుల్లోనే ఐదు భారీ సిక్సర్లు, రెండు బౌండరీలతో 51 పరుగులు చేశాడు. డారిల్ మిఛెల్ 24 (నాటౌట్), సమీర్ రిజ్వి (14), జడేజా 7 (నాటౌట్) తమవంతు పాత్ర పోషించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 143 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. సాయి సుదర్శన్ (37) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. మిగతావారు విఫలం కావడంతో టైటాన్స్‌కు ఓటమి తప్పలేదు. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్, ముస్తఫిజుర్, తుషార్ దేశ్‌పాండే రెండేసి వికెట్లను పడగొట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News