Thursday, January 23, 2025

నైట్‌రైడర్స్‌పై సిఎస్‌కె విజయం

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఐపిఎల్‌లో హ్యాట్రి క్ విజయాలతో జోరుమీదున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్‌కె) షాక్ ఇచ్చింది. సోమవారం ఇక్కడి చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఏడు వికెట్ల తేడాతో కోల్‌కతాను చిత్తు చేసింది. చెన్నైకి ఈ సీజన్‌లో ఇది మూడో విజయం కావడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. ఓపెనర్ నరైన్ 3 ఫోర్లు, రెండు సిక్సర్లతో 27 పరుగులు చేశాడు. రఘువంశీ (24), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (34) పరుగులు సాధించారు. ప్రత్యర్థి జట్టు బౌలర్లలో తుషార్, జడేజా మూడేసి వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 17.4 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 67 (నాటౌట్),డారిల్ మిఛెల్ (25), శివమ్ దూబె (28) బ్యాట్‌తో రాణించి జట్టును గెలిపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News