- Advertisement -
ముంబై ఇండియన్స్‌పై నాలుగు వికెట్ల తేడాతో గెలుపు
ముంబై: ఐపిఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ బోణీ కొట్టింది. ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన తొలి పోరులో 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రచిన్ రవీంద్ర(65), రుతురాజ్ గైక్వాడ్(53)లు అర్ధ శతకాలతో రాణించడంతో ముంబై నిర్ధేశించిన లక్ష్యాన్ని మరో ఐదు బంతులు మిగిలుండగానే అందుకుంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై.. ముంబైని తక్కువ స్కోరుకే కట్టడి చేసింది. సూర్యాకుమార్ యాదవ్(29), తిలక్ వర్మ(31), దిపక్ చాహర్(28)లు తప్ప ముంబై బ్యాటర్లలో మరెవరూ రాణించన లేకపోయారు. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మెద్ 4 వికెట్లు పడగొట్టగా.. ఖలీల్ అహ్మెద్ 3, నాథన్ ఎల్లిస్, అశ్విన్ తలో వికెట్ దక్కించుకున్నారు.
- Advertisement -