Wednesday, January 22, 2025

చెన్నై బోణీ

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ శుభారంభం చేసింది. శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. చివర్లో అనూజ్ రావత్ (48), దినేశ్ కార్తీక్ 38 (నాటౌట్) చెలరేగి ఆడడంతో బెంగళూరు మెరుగైన స్కోరును నమోదు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 18.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ రచిన్ రవీంద్ర (37), శివమ్ దూబె (34), జడేజా 25 (నాటౌట్) జట్టుకు అండగా నిలిచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News