Saturday, February 22, 2025

సన్‌రైజర్స్ చిత్తు

- Advertisement -
- Advertisement -

చెన్నై : చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో సన్ రైజర్స్ చిత్తయింది. బ్యాటింగ్, బౌలింగ్‌లలో సమష్టిగా రాణించిన చెన్నై ఘన విజయం సాధించింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 212 పరుగుల లక్ష ఛేదనకు దిగిన సన్‌రైజర్స్ బ్యాటర్లను కట్టుదిట్టమైన బౌలింగ్‌తో చెన్నై బౌలర్లు కట్టడి చేశారు. తుషార్ దేశ్ పాండే 4/27, పతిరాణ 2/17లు బాల్‌తో చెలరేగడంతో 134 పరుగులకే సన్‌రైజర్స్ కుప్పకూలింది. దీంతో 78 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. సన్‌రైజర్స్ బ్యాటర్లలో మార్‌క్రామ్ (32), క్లాసెన్(20)లు తప్ప మరెవరూ రాణించలేక పోయారు. ఇక అంతకుముందు బ్యాటింగ్ చేసిన చెన్నై రుతురాజ్ గైక్వాడ్(98), డారిల్ మిచెల్ (52), శివం ధూబె(39)లు బ్యాట్ ఝులిపిండంతో చెన్నై 211 పరుగుల భారీ స్కోరు సాధించగలిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News