Monday, December 23, 2024

సిఎస్‌ఆర్ కఫ్ కబడ్డీ విజేతగా కాటారం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మల్హర్: మల్హర్‌రావు మండలం వల్లెంకుంటలో అనసూయమ్మ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన చందుపట్ల సునీల్ రెడ్డి (సిఎస్‌ఆర్) కఫ్ కబడ్డీ ఆట విజేతగా కాటారం జట్టు నిలిచింది. కాటారం, మహాముత్తారం, మల్హర్, మహదేవ్‌పూర్, పలిమెల మండల స్థాయి కబడ్డీ ఆటలు గత కొద్దిరోజులగా కొనసాగుతున్నాయి. సోమవారం చివరి పోరులో కాటారం గ్రామం, బొమ్మాపూర్ జట్టులు తలపడగా కాటారం జట్టు విజేతగా, బొమ్మపూర్ జట్టు రన్నరఫ్‌గా నిలిచింది. విజేత సాదించిన జట్లకు రాష్ట్ర బిజెపి నాయకులు చందుపట్ల సునీల్‌రెడ్డి రూ. 10వేలు, రూ.5 వేలు అందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయని, గెలుపు ఓటములు సహజమని గెలుపే లక్ష్యంగా క్రీడాకారులు ఆటలు ఆడాలని అన్నారు. ఈకార్యక్రమంలో నిర్వహకులు, బిజెపి నాయకులు, క్రీడాకారులు పాల్గోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News