Monday, December 23, 2024

సి టెట్ ఫలితాలు విడుదల.. 9.5 లక్షల మంది ఉత్తీర్ణత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సిబిఎస్‌ఈ నిర్వహించిన కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (సి టెట్ -2022) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను శుక్రవారం సిబిఎస్‌ఈ విడుదల చేసింది. డిసెంబర్ 28 నుంచి ఫిబ్రవరి 7వరకు జరిగిన పరీక్షల్లో ఈసారి పేపర్- 1కు 17,04,282మంది రిజిస్టర్ చేసుకోగా.. 14,22,959మంది హాజరయ్యారు. వీరిలో 5,79,844మంది అర్హత సాధించినట్టు సిబిఎస్‌ఈ వెల్లడించింది. పేపర్- 2కు 15,39,464 మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోగా.. 12,76,071 మంది హాజరయ్యారు. వీరిలో 3,76,025 మంది అర్హత సాధించారు. రెండు పేపర్లు కలిపి మొత్తంగా 9.5 లక్షల మంది క్వాలిఫై అయ్యారు.

అభ్యర్థులు తమ రోల్ నంబర్‌ను ఎంటర్ చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు. జాతీయ స్థాయి ఉపాధ్యాయ అర్హత పరీక్షను డిసెంబర్ 28, ఫిబ్రవరి 7వరకు ఆన్‌లైన్‌లో నిర్వహించిన విషయం విధితమే. ఈ పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ ఆన్సర్ కీని ఫిబ్రవరి 14న వెబ్‌సైట్‌లో ఉంచారు. దీనిపై ఫిబ్రవరి 17 వరకు అభ్యంతరాలు స్వీకరించారు. సీటెట్‌లో సాధించిన స్కోర్‌కు జీవిత కాలం వ్యాలిడిటీ ఉంటుంది. ఈ స్కోర్ కేంద్ర ప్రభుత్వం పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణనలోకి తీసుకుంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News