న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సెషన్స్ సందర్భంగా రెండు రోజులపాటు దేశవ్యాప్త సమ్మెను నిర్వహించనున్నట్లు పది కేంద్రీయ కార్మిక సంఘాలు(సిటియూలు) బుధవారం పిలుపునిచ్చాయి. నవంబర్ 11 నుంచి అనేక నిరసనలు, సమావేశాలు నిర్వ కూడా తెలిపాయి. ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడి ఉపసంహరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ నిర్ణయం , కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలు,ఉపాధి సవాళ్లు, రైతు సమస్యలు వంటి వాటికి వ్యతిరేకంగా కార్మిక సంఘాలైన ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్(సిఐటియుసి), సెంటర్ ఫర్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్(సిఐటియు), హింద్ మజ్దూర్ సభ(హెచ్‌ఎంఎస్), ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్(ఐఎన్‌టియుసి) నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపాయి. నవంబర్ 11 నుంచి ఓ పద్ధతి ప్రకారం ప్రజల వద్దకు చేరేందుకు నవంబర్ 11న జాతీయ స్థాయి సమావేశం, ఆ తర్వాత రాష్ట్ర స్థాయి సమావేశాలు, ప్రదర్శనలు వంటివి దేశవ్యాప్తంగా నిర్వహించబోతున్నాయి. ఆర్‌ఎస్‌ఎస్‌కు అనుబంధంగా ఉన్న భారతీయ మజ్దూర్ సంఘ్(బిఎంఎస్) దేశవ్యాప్త సమ్మెలో, ఇతర ప్రదర్శనల్లో కేంద్ర కార్మిక సంఘాలతో కలిసి పాల్గొనబోవడంలేదు.
2021-22 యూనియన్ బడ్జెట్‌లోప్రభుత్వ రంగ కంపెనీలు, ఆర్థిక సంస్థల నుంచి పెట్టుబడి ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వం మార్గం సుగమనం చేసుకోబోతున్నది. బిపిసిఎల్, ఐడిబిఐ బ్యాంక్, ఎయిర్ ఇండియా, షప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కంటెయినర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నీలాచల్ ఇసాత్ నిగం లిమిటెడ్, పవన్ హన్స్ వంటి వాటిల్లో వాటాలు అమ్మేయబోతున్నది. దీంతోపాటుగా ఎల్‌ఐసి ఐపిఓకు కూడా ఏర్పాట్లు చేస్తున్నది. కార్మికులకు వ్యతిరేకంగా ప్రైవేటీకరణకు దిగుతోంది. ఓ ప్రక్క ధరలు విపరీతంగా పెంచేస్తూ, మరోప్రక్క ఉద్యోగ భద్రత లేకుండా చేస్తోంది. కేంద్రీయ కార్మిక సంఘాలు(సిటియూలు) తమ డిమాండ్లతోపాటుగా రైతు సంఘాల డిమాండ్లను కూడా పరిగణనలోకి తీసుకుని ఈ రెండు రోజుల సమ్మెను నిర్వహించబోతున్నాయి.