Thursday, January 23, 2025

బ్యాంక్ అధికారులకు కుచ్చుటోపి

- Advertisement -
- Advertisement -

రూ.1.4 కోట్లు ఛీటింగ్
అరెస్టు చేసిన సిసిఎస్ పోలీసులు

Cuff links for Bank Officers

 

మనతెలంగాణ, సిటిబ్యూరో: విల్లా కొనుగోలు అగ్రిమెంట్ పేరుతో మోసం చేసిన వ్యక్తిని నగర సిసిఎస్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. హైదరాబాద్‌కు చెందిన సరోర్ ఇనాయతుల్లా అనే వ్యక్తి విల్లా కొనుగోలు చేస్తానని చెప్పి బ్యాంక్ నుంచి రూ.1.4 కోట్లు రుణం తీసుకున్నాడు. అగ్రిమెంట్‌ను చూపించి రుణం తీసుకున్న నిందితుడు తర్వాత అగ్రిమెంట్ ద్వారానే ఆ విల్లాను వేరే వారికి అమ్మేశాడు. దీంతో బ్యాంక్ అధికారులకు రూ.1.4 కోట్లు కుచ్చుటోపి పెట్టారు. విషయం ఆలస్యంగా తెలుసుకున్న బ్యాంక్ అధికారులు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు నగరం నుంచి పరారై ముంబయిలో తలదాచుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని ముంబయిలో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News