Thursday, December 19, 2024

చవితి సందర్భంగా స్టార్ల సందడి..

- Advertisement -
- Advertisement -

వినాయక చవితి సందర్భంగా పలువురు స్టార్ల సినిమాల నుంచి కొత పోస్టర్లు, పాటలు విడుదలై సందడి చేశాయి. ఫిల్మ్‌మేకర్స్ ఈ సందర్భంగా సినిమాలకు సంబంధించిన కొత్త అప్‌డేట్స్‌ను కూడా తెలియజేశారు. ఇక సోషల్ మీడియాలో స్టార్ల సినిమాల కొత్త పోస్టర్లు జోరుగా వైరల్ అయ్యాయి.

రెండవ పాట వచ్చేస్తోంది…
మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు వంశీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్ పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘టైగర్ నాగేశ్వరరావు’. ఈనెల 21న విడుదల కానున్న రెండవ పాట వీడు..లో టైగ ర్ నాగేశ్వరరావు ఫెరోషియస్ అవతార్‌ని చూపించనున్నారు. దసరా కానుకగా ఈ చిత్రాన్ని అక్టోబర్20న విడుదల చేస్తున్నారు.

పండగ సందడితో…
తేజ సజ్జా కథానాయకుడిగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తు న్న చిత్రం ’హను-మాన్’. గణేష్ చతుర్థి సందర్భంగా పండుగ సందడితో నిండిన పర్ఫెక్ట్ పోస్టర్ ను విడుదల చేయడం ద్వారా మేక ర్స్ ప్రమోషన్‌లను ప్రారంభించా రు. పోస్టర్‌లో తేజ సజ్జా ట్రెడిషినల్ అవతార్‌లో కనిపించారు. చైతన్య సమర్పణలో ప్రైమ్‌షో ఎం టర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఎనర్జిటిక్ సాంగ్…
బ్లాక్‌బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేనిల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘స్కంద’. గణేష్ చతుర్థి సందర్భంగా ఈ సినిమా నుంచి కల్ట్ మామా పాటను విడుదల చేశారు. హైలీ మాస్ ఎనర్జిటిక్ సాంగ్‌గా ఎస్‌ఎస్ తమన్ కంపోజ్ చేసిన ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం హీరో సత్తాను చాటింది. ఈ సాంగ్‌లో రామ్ ఎక్స్‌ట్రార్డినరీ డ్యాన్స్ మూ మెంట్స్ అదరగొట్టగా ఊర్వశి రౌతేలా సిజ్లింగ్ షో మరో ఆకర్షణగా నిలిచింది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ మూవీ ఈనెల 28న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

దేఖో ముంబై…
ఏ.ఎం. రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి నిర్మిస్తున్న చిత్రం ’రూల్స్ రంజన్’. కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటిస్తున్న ఈ చిత్రం నుంచి ’దేఖో ముంబై’ అంటూ సాగే నాలుగో పాట లిరికల్ వీడియో విడుదలైంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 6న థియేటర్లలో విడుదల చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News