వర్ని: ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాల నిర్మాణాలతో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. నిజా మాబాద్ జిల్లా వర్ని మండలంలోని సిద్దాపూర్ గ్రామంలోని రిజర్వాయర్ నిర్మాణ ప్రాంతంలో దశాబ్ది ఉత్సవాలో భాగంగా సాగునీటి దినోత్సవ కార్యక్రమం నిర్వ హించారు. ఈ కార్యక్రమానికి శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, నిజా మాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, కామారెడ్డి కలెక్టర్ జితేష్ పాటిల్, జిల్లా అటవీ శాఖాధికారి వికాస్‌లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని పదేళ్లలోకి అడుగిడిన సందర్భంగా ఒక్కొక్క రంగంలో సాధించిన పురోగతిని గుర్తించేందుకు దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో 6వ రోజుల్లో భాగంగా సాగునీటి దినోత్సవం సందర్భంగా సిద్దాపూర్‌లో సాగునీటి రిజర్వాయర్ నిర్మాణం ప్రాంతంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగిం దన్నారు. దీని కోసం సభాపతి పోచారం ఇంజనీరింగ్ అధికారులు ఇఎఫ్‌ఓతో కలిసి రెండు నెలల క్రితం ఈ ప్రాంతాన్ని సందర్శించామన్నారు.
అయితే రిజర్వా యర్ నిర్మాణంకు 500 ఎకరాల భూమి అవసరం ఉండడంతో అంతా అటవీ శాఖ భూమి ఉండడంతో వారి అనుమతి కోరగా వారు 50 ఎకరాల రెవెన్యూ భూమి ఇవ్వాలని అడగడంతో భూమిని గుర్తించి అప్పగించామని టెక్నికల్ పనులు జరుగు తున్నాయన్నారు. సాగునీటి దినోత్సవం ఇంజనీరింగ్ అధికారులు సాధించిన పురోగతిలో వారి భాగస్వామ్యం ఉన్నదని కలెక్టర్ కొనియాడారు. తొమ్మిదేళ్లు కష్టపడితే ప్రతి ఫలాలు అందాయన్నారు. మిషన్ కాకతీయలో పనుల ద్వారా వాట ర్ ట్యాంక్‌లు చెక్ డ్యాంలు నిర్మించామన్నారు. ప్యాకేజ్ 20,21,22 పనులు చేప ట్టామన్నారు.
ఎస్సాఆర్ ఎస్పీ పునర్జివన పథకం ద్వారా ముప్కాల్‌లో పంప్ హౌస్ నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఇరిగేషన్ ద్వారా రూ. 5800 కోట్ల ప్రాజెక్టు పనులు అనుమతి రాగా రూ. 4800 కోట్ల పనులు పూర్తయ్యాయన్నారు. 2014లో వరి పంట సాగులో 24 స్థానంలో ఉన్న తెలంగాణ ప్రస్తుతం దేశంలో రెండవ స్థానంలో ఉందని కలెక్టర్ తెలిపారు. యాసంగిలో దేశంలో 94 లక్షల ఎకరాల్లో వరి పంట పండించగా తెలంగాణలో 54 ఎకరాలలో వరి పంట పండించారు. సాగునీటి లభ్యత ఉంది. కాబట్టి వరి పంట పండిం చగలిగామన్నారు. మిషన్ కాకతీయ ద్వారా గ్రౌండ్ వాటర్ పెరగడంతో భూగర్బ జలలు పైకి వచ్చాయన్నారు.