హైదరాబాద్: మన రాష్ట్రంలో యాసంగి పంటల సాగు అదను కాలం ముగిసిపోయింది. ఈసారి వ్యవసాయరంగానికి వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో పంట ల సాగు విస్తీర్ణం రికార్డుస్థాయిలో పెరిగిపోయింది. యాసంగి సీజన్‌లో ఎంపికచేసుకున్న సాధారణ పంటల సాగు విస్తీర్ణపు అంచనాలను మించి పో యి ఆహారధాన్యాలు, పప్పుధాన్యాలు, పంటలు కలిపి బుధవారం నాటికి 139.67శాతం విస్తీర్ణంలో సాగులోకి వచ్చాయి. యాసం గి సాగు విస్తీర్ణం సీజన్ ముగిసేసరికి 52.88లక్షల ఎకరాలతో 114శాతం విస్తీర్ణత వద్దనే ఆగిపోగా ఈ ఏడాది యాసంగిలో అన్ని రకాల పంటలు కలి పి 66,84,156 ఎకరాల విస్తీర్ణంలో సాగులోకి వ చ్చాయి. పంటల సాగు అదను సమీపించగానే ము ఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాల మేరకు ఆర్ధిక ,వ్యవసాయశాఖలు రైతుబంధు పథకం నిధులను పంపిణీ చేశాయి.
దీంతో విత్తనాలు, రసాయనిక ఎరువుల కొనుగోలుతోపాటు పైర్లసాగుకు అవసరమైన కూ లీల ఖర్చులకు కూడా రైతుబంధు నిధులు చేతికందడంతో రైతులు యాసంగి పంటసాగు పట్ల ఎంతో ఉత్సాహం కనబరిచారు. మందకోడిగా ప్రారంభమైన పంటల సాగు రానురాను పుంజుకుంటూ వ చ్చింది. రాష్ట్ర వ్యవసాయశాఖ బుధవారం విడుదల చేసిన యాసంగి పంటల సాగు నివేదిక మేరకు రాష్ట్రంలో 47.85లక్షల సాధారణ పంటలసాగు వి స్తీర్ణత ప్రణాళికకు గాను మొత్తం 66.84లక్షల ఎకరాల్లో పంటలు సాగులోకి వచ్చాయి. సీజన్ ముగిసినప్పటికీ ఇంకా కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వరినాట్లు పడుతున్నాయి. దీన్ని బట్టి ్ల యాసంగి సాగు విస్తీర్ణం మరో లక్ష ఎకరాలు పెరిగే అవకాశాలు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు.
108శాతం చేరిన పప్పుధాన్య పంటలు
వరికి ప్రత్యామ్నాయంగా పప్పుధాన్యాలు , నూనెగింజ పంటల సాగు లాభదాయకంగా ఉన్నప్పటికీ రైతుల ఈ సారి ఈ పంటల సాగుపట్ల సాధారణ రీతిలోనే స్పందన కనబరిచారు. రాష్ట్రంలో పప్పుధాన్యపంటల సాధారణ సాగు విస్తీర్ణం 3.91లక్ష ల ఎకరాలు కాగా, ఈ యాసంగిలో 108.91 శా తం విస్తీర్ణంలో ఈ రకం పంటలు సాగులోకి వచ్చా యి. కంది, పెసర, పప్పుశనగ, అలసం ద తదితర పప్పుధాన్య పంటలు మొత్తం 4.26లక్షల ఎకరాల్లో సాగు చేశారు. అందులో పప్పుశనగ 3.59లక్షల ఎకరాలు, మినుము 44881ఎకరా లు, పెసర 11050ఎకరాలు, కంది 2525ఎకరా లు, అలసంద 7160 ఎకరాలు, 1175 ఎకరాల్లో సాగు చేశారు. యాసంగిలో పప్పుధాన్య పంటలు 4.82లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగు చే యగా, ఈసారి 46వేల ఎకరాల్లో పప్పుధాన్య పం టల సాగు తగ్గింది. 202021 యాసంగిలో కూ డా 4.51లక్షల ఎకరాల్లో పప్పుధాన్య పంటలు సాగులోకి వచ్చాయి.
తగ్గిన నూనెగింజ పంటల సాగు
ఈ యాసంగిలో నూనెగింజ పంటల సాగు తగ్గిపోయింది. 3.91లక్షల ఎకరాల సాధారణ సాగు విస్తీర్ణతకుగాను 77.52శాతం విస్తీర్ణంలోనే సాగు జరిగింది. అయితే కుసుమ పంట సాగు విస్తీర్ణం మాత్రం సాధారణ విస్తీర్ణత కంటే భారీగా పెరిగి 229.97శాతానికి చేరింది. మిగిలిన రకాల నూనెగింజ పంటల విస్తీర్ణం 100శాతం లోపే ఉన్నాయి. వేరుశనగ 2.40లక్షల ఎకరాలు, నువ్వులు 14994 ఎకరాలు, పొద్దుతిరుగుడు 16667ఎకరాలు, కుసుమ 20,847 ఎకరాలు, అవాలు తదితర మరికొన్ని పంటలు 9714ఎకరాల్లో సాగు చేశారు. అన్నిరకాల నూనెగింజ పంటలు మొత్తం 3.03లక్షల ఎకరాల్లో సాగు చేయగా, గత ఏడాది యాసంగిలో 4.32లక్షల ఎకరాల్లో ఈ పంటలు సాగులోకి వచ్చాయి. 2022021లో 3.54 లక్షల ఎకరాల్లో నూనెగింజ పంటల సాగు జరిగింది.
రికార్ఢు స్థాయికి వరినాట్లు!
ఈ ఏడాది భారీ వర్షాలతో ప్రాజెక్టులు సామర్ధం కంటే రెండు మూడు సార్లకు పైగానే నిండిపోయాయి. చెరువులు వదర నీరు మత్తడులెక్కి పారింది. భూగర్భజల మట్టాల్లో కూడా భారీ వృద్ది కనిపించింది. పరిస్థితులన్ని అనుకూలించటంతో యాసంగిలో రికార్డు స్థాయిలో వరిసాగు జరిగింది. సాధారణ వరిసాగు విస్తీర్ణపు అంచనాలు మిచిపోయి మొత్తం 153.67శాతం విస్తీర్ణంలో వరిసాగు జరిగింది. రాష్ట్రంలో యాసంగి వరిసాగు సాధారణ విస్తీర్ణం 33.53లక్షల ఎకరాలుగా అంచనా వేయగా, ఈ యాసంగిలో 51,53,858ఎకరాల్లో వరినాట్లు పడ్డాయి. వరి సాగుకు అదను కాలం ముగిసినప్పటికీ ఇంకా కొన్ని జిల్లాల్లో వరినాట్లు వేస్తూనే ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.
మరో లక్ష ఎకరాల్లో వరినాట్లు పెరిగే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. గత అదే జరిగితే 202021 యాసంగిలో వరిసాగు 52.96లక్షల రికార్డును అధిగమించి ఈ యాసంగి వరిసాగు విస్తీర్ణం కొత్త రికార్డును నెలకొల్పనుందంటున్నారు.202122యాసంగిలో కూడా 38.84లక్షల ఎకరాల వద్దనే వరిసాగు విస్తీర్ణం ఆగిపోయింది.ఇతర ఆహారధాన్యపంటల్లో గోధుమ 8211 ఎకరాలు, జొన్న 1,17,319ఎకరాలు, సజ్జ 893 ఎకరాలు,మొక్కజొన్న 6,17,689ఎకరాలు, రాగి 341 ఎకరాల్లో సాగులోకి వచ్చాయి.