Friday, January 24, 2025

ఖమ్మంలో గంజాయి పట్టివేత

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : ఖమ్మం కొత్త బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా ఎక్సైజ్ బృందాలు తనిఖీలు నిర్వహించగా ఉత్తరప్రదేశ్ బదౌన్ జిల్లా మోహల్ల మల్యన్ గ్రామానికి చెందిన రషీద్, షేక్ అబ్దుల్లా నార్త్ ఈస్ట్ ఢిల్లీ గర్హన్ మండుకి చెందిన మహ్మద్ యాసిన్ అనే ముగ్గురు ముద్దాయిలు ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా నుండి 31 కేజీల ఎండు గంజాయిని ఢిల్లీకి తరలించడానికి ఖమ్మం నగరంలోని కొత్త బస్టాండ్ సమీపంలోకి వచ్చి అనుమానాస్పదంగా తచ్చాడుతుండగా ఎక్సైజ్ బృందం వారిని అదుపులోకి తీసుకుని, గంజాయిని స్వాధీనం చేసుకుంది. వారిపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు ఖమ్మం జిల్లా ఎక్సైజ్ అధికారి జి.నాగేంద్ర రెడ్డి తెలిపారు.

నిందితుల్లో సుక్మాలో ఈ గంజాయిని కేజీలు రూ.3000ల చొప్పున కొనుగోలు చేసి, వివిధ మార్గాల ద్వారా ఖమ్మం చేరుకుని ఇక్కడి నుంచి ఆర్‌టిసి బస్ ద్వారా హైదరాబాద్ చేరుకుని అక్కడి నుండి ట్రైన్ ద్వారా ఢిల్లీ చేరుకోవాలని అనుకుంటుండగా ఖమ్మం బస్టాండ్ లో పట్టుబడ్డారు. నిందితులు గత కొన్ని రోజులుగా ఈ విధంగా గంజాయి ని అక్రమంగా తరలిస్తూ అక్కడ కేజీ రూ. 20 వేల చొప్పున అమ్ముతున్నారని విచారణ లో తేలిందని ఆయన తెలిపారు.

ఈ తనిఖీల్లో ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏఇఎస్‌లు వి.వేణుగోపాల్ రెడ్డి కె.తిరుపతి, ఖమ్మం-1 ఎక్సైజ్ సిఐ కె.రాజు, ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ వై.సర్వేశ్వర రావు అధికారులు వి.రవి, ఎల్.అచ్చారావు, షేక్ రబ్బానీ, లత సిబ్బంది రామారావు, కరీం, శశికాంత్, నాగేశ్వర రావు, రమేష్, రవి, విశ్వనాథ్,సుధీర్, మారేశ్వరరావు, శ్రీనివాస రెడ్డి, లలిత రమాదేవి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News