Wednesday, January 22, 2025

సాగు జోరు

- Advertisement -
- Advertisement -

మన రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలతో పంటలసాగు విస్తీర్ణం ఊపందుకుంది. రా ష్ట్రంలో వరినాట్ల పనులు జోరుమీద సాగుతున్నాయి. ఆహారధాన్యాలు నూనె పప్పు వాణిజ్య పంటలు తదితర అన్ని పంటలు కలిపి రాష్ట్రంలో ఖరీఫ్‌సా గు విస్తీర్ణం 77.07శాతానికి చేరుకుంది. రాష్ట్రమంతటా ఈ సీజన్‌లో కోటి 24లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగు చేయించాలన్నది ప్రభుత్వ లక్షం కాగా, ఇప్పటివరకూ 95.78లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగులోకి వచ్చాయి. ఈ సమయానికి అన్ని పంటలు కలిపి 95. 14లక్షల ఎకరాల్లో సాగులోకి రావాల్సివుండగా ,సాధారణ విస్తీర్ణం కంటే కొంచెం అధికంగానే సాగులోకి వచ్చా యి. గత ఏడాది ఇదే సమయానికి రాష్ట్రంలో అన్ని పంట లు కలిపి 83.43లక్షల ఎకరాల్లోనే సాగులోకి వచ్చాయి. గత ఏడాదితో పొలిస్తే 12 .35లక్షల ఎకరాల విస్తీర్ణంలో అధికంగా సాగులోకి వచ్చాయి.

వరిసాగు విస్తీర్ణపు లక్ష్యాలు ఈ సీజన్‌లో 49.86లక్షల ఎకరాలకు నిర్దేశించుకోగా ,ఇప్పటివరకూ 36.06లక్షల ఎకరాల్లో వరినాట్లు పడ్డాయి. సాధారణ లక్ష్యాల్లో ఇది 72.31శాతానికి చేరుకుంది. 21763ఎకరాల్లో జొన్న, 76ఎకరాల్లో సజ్జ, 5.02లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 327ఎకరాల్లో రాగి పంటలు సాగులోకి వచ్చాయి. పప్పుధాన్య పంటలకు సంబంధించి కంది 4.55లక్షల ఎకరాలు, పెసర 49వేల ఎకరాలు, మినుము 18వేల ఎకరాలు, ఉలవ 88ఎకరాలు,సాగులోకి వచ్చాయి. పప్పధాన్య పంటల మొత్తం 5.23లక్షల ఎకరాలతో సాధారణ సాగులక్ష్యాల్లో 55.51శాతం విస్తీర్ణతకు చేరుకున్నాయి. నూనెగింజ పంటల సాగు విస్తీర్ణం 5.19లక్షల సాధారణ విస్తర్ణపు లక్ష్యాలకుగాను ఇప్పటివరకూ 4.51లక్షల ఎకరాలకు చేరుకుంది. ఇందులో వేరుశనగ 5937 ఎకరాలు, సోయాబీన్ 4.43లక్షల ఎకరాలు, ఆముదం 2564ఎకరాలు, కుసుమ, ఆవాలు తదితర పంటలతో కలిపి నూనెగింజల సాగు విస్తీర్ణం 55.51శాతానికి చేరుకుంది.

87.96శాతం వద్దే ఆగిన పత్తి విస్తీర్ణం
రాష్ట్రంలో ఈ సారి పత్తిసాగు విస్తీర్ణం 87.96శాతం వద్దే ఆగిపోయింది. మొత్తం 50.59లక్షల ఎకరాల్లో పత్తిసాగు సాధారణ లక్ష్యాలుగా ఎంపిక చేయగా, ఇప్పటివరకూ 44.49 లక్షల ఎకరాల్లోనే పత్తి విత్తనం పడింది. నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం కావటంతో పత్తి విత్తనం వేసేందుకు వాతావరణం ఆశించిన రీతిలో అనుకూలించలేదు. ఆ తరువాత కురిసిన భారీ వర్షాలు కూడా పత్తి సాగు విస్తీర్ణంపైన ప్రతికూల ప్రభావం చూపాయి. చాల ప్రాంతాల్లో వేసిన పత్తి పైర్లు కూడా దెబ్బ తిన్నాయి. ఇప్పటికే పత్తిసాగుకు అదను దాటి పోయింది. ఇకపైన పత్తివిత్తనాలు వేయవద్దని శాస్త్రవేత్తలు రైతులకు సూచిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ సారి పత్తిసాగుకు కాలం అంతగా కలిసిరాలేదని రైతులు చెబుతున్నారు. మిగిలిన వాణిజ్య పంటల్లో పొగాకు 46ఎకరాలు, చెరకు సాగు 20103ఎకరాల్లో జరిగింది.మిగిలిన వాణిజ్య పంటలు మరో 1270ఎకరాల్లోసాగు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News