హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా మధుమేహం ఒక ప్రధాన ఆరోగ్య సమస్య – ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో భారతదేశంలో 77 మిలియన్ల కంటే ఎక్కువ మంది మధుమేహంతో బాధపడుతున్నారు. డేటా ప్రకారం ఈ సంఖ్య 2045 నాటికి 135 మిలియన్లకు చేరుకుంటుంది. నిజానికి ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) మార్గదర్శకాలు 2022 ప్రకారం, గత మూడు దశా బ్దాలుగా దేశంలో మధుమేహంతో బాధపడుతున్న వారి సంఖ్య 150% పెరిగింది. అధిక ప్రాబల్యం, సంబంధిత భారం ఉన్నప్పటికీ, మధుమేహం, ఇతర నాన్-కమ్యూనికబుల్ వ్యాధులు (NCDలు) నిర్లక్ష్యం చేయబడు తున్నాయి.
డయాబెటిస్ ప్రాబల్యం నాటకీయ పెరుగుదల ఎక్కువగా జనాభా, సామాజిక ఆర్థిక, పోషక కారకాలలో వేగ వంతమైన మార్పుల మూలంగా అని చెప్పవచ్చు. దీనితో పాటు, ప్రధానంగా నిశ్చల జీవనశైలి ఊబకాయం మరియు ఇతర ఆహార సంబంధిత నాన్‌కమ్యూనికబుల్ వ్యాధుల పెరుగుదలకు దారితీసింది. ఈ పరిస్థితిని ఎలా నిర్వహించాలి అనే దాని గురించి అబాట్ న్యూట్రిషన్ బిజినెస్ మెడికల్ అఫైర్స్ హెడ్ డాక్టర్ ఇర్ఫాన్ షేక్ మాట్లాడుతూ.. “డయాబెటిస్ అనేది దీర్ఘకాలిక వ్యాధి, దీనిపై శ్రద్ధ అవసరం. రోగనిర్ధారణ చేయకపోతే, కాల క్రమేణా, పెరిగిన గ్లూకోజ్ స్థాయిలు గుండె జబ్బులు, దృష్టి నష్టం, మూత్రపిండాల రుగ్మతలు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి.
జీవనశైలి నిర్వహణ వంటి ప్రారంభ జోక్యాలు మధుమేహాన్ని నిర్వహించడం లో కీలక పాత్ర పోషిస్తాయి. డయాబెటిక్ స్పెసిఫిక్ న్యూట్రిషన్ సప్లిమెంట్స్(DSNS), గ్లూకోజ్ స్థాయిలపై శారీరక శ్రమ వంటి అంశాలతో పోషకాహారం పాత్రను అర్థం చేసుకోవడం పరిస్థితి సరైన నిర్వహణకు చాలా అవసరం. అబాట్, వివిధ కార్యక్రమాల ద్వారా మధుమేహం గురించి మరింత అవగాహన కల్పించేందుకు, ఆ పరిస్థితిని నిర్వహించడానికి సరైన పోషకాహారం అవసరాన్నిచాటేలా అవగాహ న పెంచడానికి కట్టుబడి ఉంది’’ అని అన్నారు.
మధుమేహ వ్యాధిగ్రస్తులకు పోషకాహారం ప్రాముఖ్యతను నొక్కిచెబుతూ, ట్రాన్స్ కల్చరల్ డయాబెటిస్ న్యూట్రి షన్ అల్గారిథమ్ (tDNA) అనేది విభిన్న సాంస్కృతిక, భౌగోళిక పరిస్థితులలో టైప్ 2 డయాబెటిస్ (T2D), ప్రీడయాబెటిస్ ఉన్నవారికి పోషకాహార చికిత్సను అందించేందుకు పరిచయం చేయబడిన కొత్తతరం సాధనం. tDNA ప్రీడయాబెటిస్, T2D కోసం ఇంటర్వెన్షన్స్ ను లక్ష్యంగా చేసుకుంటుంది. సాంస్కృతిక పద్ధతులు, సహ వ్యాధులలోని వైవిధ్యాలను పరిగణనలోకి తీసుకుంటుంది. డయాబెటిస్ కోసం ప్రస్తుత క్లినికల్ ప్రాక్టీస్ మార్గద ర్శకాలు విభిన్న సంస్కృతులకు వర్తింపు కానటువంటి అన్ని స్థాయిలలో ఇంటర్వెన్షన్స్ ను పరిష్కరిస్తుంది.
tDNA ఆవిష్కరణతో, మధుమేహం ఉన్నవారికి పోషకాహార ఇంటర్వెన్షన్స్ ప్రయోజనాలపై అవగాహన పెంచ డం, జీవనశైలి, ఆహారాలు, సంస్కృతులలో ప్రాంతీయ వ్యత్యాసాలకు అనుగుణంగా ఆరోగ్యకరమైన ఆహార పద్ధతులను ప్రోత్సహించడం, ఇప్పటికే ఉన్న క్లినికల్ ప్రాక్టీస్ మార్గదర్శకాల (CPGలు) అమలును మెరుగు పరచడం లక్ష్యంగా ఉంటుంది.
జోస్లిన్ డయాబెటిస్ సెంటర్‌లోని ఇన్‌పేషెంట్ డయాబెటిస్ ప్రోగ్రామ్ డైరెక్టర్, ఒబేసిటీ క్లినికల్ ప్రోగ్రామ్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ఒసామా హమ్డీ ఇలా అన్నారు, “ఆరోగ్యకరమైన ఆహారంలోకి మారినప్పుడు, దశాబ్దాలుగా కొన సాగిస్తూ వచ్చిన ఆహారపు అలవాట్లను వదిలివేయడాన్ని మధుమేహ వ్యాధిగ్రస్తులలో సాధారణంగా గమనిం చవచ్చు, దీని అర్థం 38% కంటే తక్కువ కట్టుబడి ఉండే రేటు. అందువల్ల, ట్రాన్స్ కల్చరల్ డయాబెటిస్ న్యూ ట్రిషన్ అల్గోరిథం (tDNA) అనేది జీవనశైలి సిఫార్సుల అమలును ప్రోత్సహించడానికి, ప్రీడయాబెటిస్, T2D రోగులలో వ్యాధి-సంబంధిత ఫలితాలను మెరుగుపరచడానికి ఉద్దేశించిన ఒక చికిత్సా సాధనం. తనకు కావాల్సినంత తినడం, బరువు తగ్గడం, గ్లైసెమిక్ నియంత్రణ నిర్వహణలలో ఇది రోగికి తోడ్పడుతుంది’’ అని అన్నారు.
డాక్టర్ ఇర్ఫాన్ షేక్ మరింతగా వివరిస్తూ, “భారతీయ ఆహారం ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటుంది. సాధా రణంగా కార్బోహైడ్రేట్లు & కొవ్వులు లేదా రెండింటితోనూ అధికంగా ఉంటుంది. వివిధ జీవనశైలి తేడాలు, జనాభా నమూనాల కారణంగా భారతదేశంలోనే టైప్ 2 మధుమేహం భారంలో అంతర్-ప్రాంతీయ అసమానత లు అంచనా వేయబడ్డాయి. ఇటీవలి సమాచారం ప్రకారం, తెలంగాణ రాష్ట్రంలో మధుమేహం ప్రాబల్యం 16.6% గా అంచనా వేయబడింది, ఇది ముంబై (7.5%), చెన్నై (13.5%), బెంగళూరు (11.7%) వంటి నగరాల కంటే ఎక్కువ. అందుకే, ఒక భారతీయులకు తగ్గట్లుగా మార్చబడిన tDNA ప్రీడయాబెటిస్, T2D కోసం మరింత ని ర్మాణాత్మక, క్రమబద్ధమైన, ప్రభావవంతమైన మార్గంలో దాని నిర్వహణలో వైద్యులకు మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది, తద్వారా రోగులు దీనికి కట్టుబడి ఉండడం పెరుగుతుంది’’ అని అన్నారు.
నేడు, మధుమేహం ప్రాబల్యం దేశంలోని గ్రామీణ-పట్టణ విభజనలో మాత్రమే కాకుండా రాష్ట్రాలలో కూడా విభి న్నంగా ఉంది. ఎందుకంటే వివిధ రాష్ట్రాలు జనాభా పరివర్తన వివిధ దశలలో ఉన్నాయి. అందువల్ల, చికిత్స చేసే వైద్యులు, మధుమేహ వ్యాధిగ్రస్తులు ఇరువురితో ప్రమేయం కలిగిఉండే మరింత కఠినమైన, ఆచరణాత్మ కమైన విధానాన్ని కలిగిఉండాల్సిందిగా, కాంప్లియెన్స్ అనేది ఎలా ప్రయోజనకరమైన ప్రభావాన్ని చూపుతుం దనే దానిపై మధుమేహ వ్యాధిగ్రస్తులు అవగాహన కలిగి ఉండాలని మధుమేహం అధిక భారం సూచిస్తోంది. tDNA తన నిర్మాణాత్మక, ఆచరణాత్మక విధానంతో ఈ ప్రయోజనాన్ని అందించడంలో సహాయ పడుతుంది. ఆసియా భారతీయ tDNA అనుకూలీకరణ కోసం ప్రయత్నాలు వివిధ శారీరక, పోషక, అంటువ్యాధి, రోగ నిర్ధారణ, ఆంత్రోపోమెట్రిక్ కారకాలు అలాగే పోషక, సాంస్కృతిక కారకాలను ప్రతిబింబిస్తాయి.
అబాట్ గురించి
అబాట్ ఒక గ్లోబల్ హెల్త్ కేర్ లీడర్. ఇది ప్రజలు జీవితంలోని అన్ని దశలలో మరింత సంపూర్ణంగా జీవించ డంలో సహాయపడుతుంది. జీవితాన్ని మార్చే సాంకేతికతల పోర్ట్ ఫోలియో, రోగనిర్ధారణ, వైద్య పరికరాలు, పోషకాలు, బ్రాండెడ్ జెనరిక్ ఔషధాలలో ప్రముఖ వ్యాపారాలు, ఉత్పత్తులతో ఆరోగ్య సంరక్షణ స్పెక్ట్రమ్‌ను విస్తరించింది. మా 115,000 మంది సహచరులు 160 కంటే ఎక్కువ దేశాలలో ప్రజలకు సేవ చేస్తున్నారు.