Thursday, January 23, 2025

సంస్కృతి, సంప్రదాయాల సమ్మేళనం.. లెజెండరీ వంటకాల స్వర్గధామం హైదరాబాద్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: స్థానిక ఆహారాన్ని ప్రయత్నించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎంపికైన అగ్రగామి 100 నగరాల్లో హైదరాబాద్‌ నిలవటం పట్ల గోల్డ్ డ్రాప్ తమ సంతోషం వ్యక్తం చేస్తుంది. ప్రముఖ ఫుడ్ గైడ్, టేస్ట్ అట్లాస్ – ప్రపంచవ్యాప్తంగా ఉన్న నగరాల్లోని ఆహార అద్భుతాలను జాబితా చేస్తుంది. ప్రాంతీయ వంటకాలు, సుసంపన్నమైన సంస్కృతి, సంప్రదాయాలతో కూడిన వంటకాలుగా హైదరాబాద్‌ను దీనిలో పేర్కొన్నారు.

గోల్డ్ డ్రాప్ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ మితేష్ లోహియా మాట్లాడుతూ..“గ్లోబల్ టాప్ 100లో హైదరాబాద్ ప్రాంతీయ వంటకాలను ప్రముఖంగా చూడటం ఆనందంగా ఉంది. ఈ కలినరీ ప్రయాణం లో మేము కూడా భాగం కావటం తో గోల్డ్ డ్రాప్‌ వద్ద ఈ విజయాన్ని మేము వేడుకగా జరుపుకుంటున్నాము. నగరం దాని చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే గొప్ప, విభిన్న వంటకాలను కలిగి ఉంది. కొన్ని వంటకాలు ఇప్పటికీ కుటుంబ వంటకాలకు దగ్గరగా ఉంటాయి. ఇది నిజమైన #SwadJoZindagiSeJudJaaye. గోల్డ్ డ్రాప్ దాని ప్రపంచ స్థాయి నాణ్యతా ప్రమాణాలతో ఆహారం యొక్క ప్రామాణికమైన రుచిని నిర్వహిస్తుంది” అని అన్నారు.

భోజన ప్రియులకు హైదరాబాద్‌, వంటల స్వర్గధామం. ప్రఖ్యాత బిర్యానీ నుండి స్ట్రీట్ ఫుడ్, చాట్, కుల్ఫీ, పెసర దోసె వరకు, ప్రతి బైట్ లో రుచి, సంస్కృతి ఉంటుంది.

హైదరాబాద్‌ను దాని ఆహారం ద్వారా వివరించడానికి, ఇక్కడ ఒక ఖచ్చితమైన గైడ్ ఉంది.

బిర్యానీ: హైదరాబాదీ బిర్యానీ కేవలం వంటకం కాదు, అది ఒక వ్యక్తీకరణ. సంవత్సరాలుగా, సువాసనగల బిర్యానీ – అది కచ్చి (ముడి), పక్కి (వండినది) అయినా, ప్రతి దానికీ ప్రత్యేక అభిమానులు ఉన్నారు. మాంసం, అన్నం కలిపి వండే దమ్ స్టైల్ దీనికి విలక్షణమైన రుచిని ఇస్తుంది.

హైదరాబాదీ చక్నా: మేకల భాగాలతో తయారు చేసిన ఈ మసాలా వంటకం, నాన్‌తో వడ్డించడం ప్రాంతీయ ప్రత్యేకత. ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం, యాలకులు, జొన్నలు, పసుపు, ఉప్పు, ఎర్ర మిరపకాయ, నల్ల మిరియాలు, గరం మసాలా, తాజా కొత్తిమీర, బే ఆకులు, పచ్చి మిరపకాయలు వంటివి దీనికి అద్భుతమైన రుచిని అందిస్తుంది.

మిర్చి కా సలాన్: లేత పచ్చి మిరపకాయలు, చింతపండుతో వండిన కూడిన కూర. మరొక ఇష్టమైన సలాన్ బైంగన్ మిర్చి కా సలాన్.

హైదరాబాదీ హలీమ్: రంజాన్ సందర్భంగా ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందిన హలీమ్‌ను మాంసం, పప్పులు, గోధుమలతో తయారు చేస్తారు, రాత్రిపూట ఒకే కుండలో నెమ్మదిగా వండుతారు.

దోశెలు: దక్షిణ భారతదేశం అంతటా, వివిధ రకాల దోశెలు ఉన్నాయి. హైదరాబాద్ దోశెలు తమ మూలాన్ని కొనసాగిస్తూనే తమదైన ప్రత్యేకత చూపుతున్నాయి. విభిన్నమైన చట్నీల శ్రేణి వీటితో పాటు అందుబాటులో ఉంటుంది. అల్పాహారం గా వీటిని తీసుకోవచ్చు.

కబాబ్స్: నోరూరించే ఈ తయారీని మాంసం లేదా కూరగాయలు లేదా పనీర్‌తో తయారు చేస్తారు. ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నది షికంపురి కబాబ్ – హైదరాబాద్‌ లో ప్రత్యేక వంటకం ఇది.మలిడా, ఖుబానీ కా మీఠా వంటి తియ్యందనాలు సైతం ఇక్కడ ప్రసిద్ధి చెందాయి, అలాగే హైదరాబాద్‌లోనే కరాచీ బేకరీ నుండి బిస్కెట్లు ఉద్భవించాయి.కొత్త రుచులు,సంస్కృతులను అన్వేషించడానికి ఇష్టపడే ఎవరైనా తప్పనిసరిగా సందర్శించవలసిన గమ్యస్థానంగా ఈ నగరం ఎల్లప్పుడూ ముందు వరుసలోనే ఉంటుంది. రండి, హైదరాబాద్‌ని వేడుక చేసుకుందాం! .

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News