Thursday, February 6, 2025

ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. ఛాంపియన్స్ ట్రోఫీకి ఆ ఇద్దరు స్టార్ బౌలర్లు దూరం

- Advertisement -
- Advertisement -

ఛాంపియన్స్‌ ట్రోఫీకి మందు ఆస్ట్రేలియా జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టును గాయాల బెడద వెంటాడుతోంది.తాజాగా మరో ఇద్దరు స్టార్ బౌలర్లు గాయపడ్డారు. దీంతో ఛాంపియన్స్ ట్రోపీకి వారిద్దరూ దూరమయ్యారు. ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్, పేసర్ హేజిల్‌వుడ్ లు ఈ మెగా ట్రోఫీకి దూరమైనట్లు ఐసీసీ ప్రకటించింది.

మడమ గాయంతో కమిన్స్, తుంటి సమస్యతో హేజిల్ ఆడటం లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే గాయం కారణంగా మిచెల్ మార్ష్ వైదొలగగా.. స్టొయినిస్ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు ఈ నలుగురు కీలక ప్లేయర్ల స్థానంలో మరో నలుగురిని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఎంపిక చేయాల్సి ఉంది.కాగా, ఈ నెల 19 నుంచి ఛాంపియన్స్‌ ట్రోఫీ ప్రారంభం కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News