- Advertisement -
బెంగళూరు: పార్లమెంట్ ఎన్నికల సమయంలో కర్నాటక రాష్ట్రంలో భారీగా నగదు, బంగారాన్ని పట్టుకోవడం కలకలం సృష్టించింది. బళ్లారిలోని ఓ వ్యాపారి ఇంట్లో పోలీసులు తనిఖీలు చేశారు. ఈ సోదాలలో రూ.7.6 కోట్ల నగదు, బంగారు, ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఇది లెక్కలోనికి రాని నగదు, ఆభరణాలుగా గుర్తించారు. రూ.5.6 కోట్ల నగదు, 103 కిలోల వెండి ఆభరణాలు, 68 వెండి కడ్డీలు, మూడు కిలోల బంగారు నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హవాలా మార్గంలోనే నగదును తీసుకొచ్చారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వివరాలను ఆదాయపు పన్ను విభాగానికి తెలియజేస్తామని వ్యాపారి నరేష్ పేర్కొన్నారు. తరువాత ఐటి అధికారులు చర్యలు తీసుకోవచ్చని వివరించారు. కర్నాటకలో మొత్తం 28 లోక్ సభ స్థానాలకు రెండు దశల్లో పోలింగ్ జరుగుతోంది.
- Advertisement -