- Advertisement -
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం 2016 నవంబర్ 8న పెద్ద నోట్ల రద్దు(డిమానిటైజేషన్) ప్రకటించిన తర్వాతి నుంచి నగదు చెలామణి దాదాపు 83 శాతానికి పెరిగిపోయింది. కేంద్ర ప్రభుత్వ నోట్ల రద్దు విషయాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం సైతం సోమవారం సమర్థించింది. 2016 నవంబర్ 8న రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు మోడీ ప్రభుత్వం ప్రకటించింది. నల్లధనాన్ని అరికట్టి డిజిటల్ చెల్లింపులను ప్రోత్సాహించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా 2022 డిసెంబర్ 23 నాటికి రిజర్వు బ్యాంకు డేటా ప్రకారం సిఐసి విలువ రూ. 32.42 లక్షలకు పెరిగింది. ఇది 2016 నవంబర్ 4న రూ. 17.74 లక్షల కోట్లు ఉండింది.
- Advertisement -