Wednesday, January 22, 2025

గాలిలో కరెన్సీ నోట్లు..రోడ్లపై కలకలం(వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: నగరంలోని ఎఆర్ మార్కెట్ ప్రాంతంలో ఉన్న ఫ్లై ఓవర్‌పై నుంచి ఓ వ్యక్తి 10 రూపాయల కరెన్సీ నోట్లు గాలిలో విసిరేయడం కలకలం రేపింది. మంగళవారంపదయం జరిగిన ఈ సంఘటనతో కొద్ది నిమిషాల పాటు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. రోడ్డు ప్రయాణిస్తున్న వాహనదారులు కరెన్సీ నోట్లు ఎగిరి రావడం చూసి తమ వాహనాలను ఎక్కడికక్కడ ఆపేసి వాటిని పట్టుకోవడానికి ప్రయత్నించడంతో గందరగోళ వాతావరణం ఏర్పడింది.

పోలీసులు వెంటనే స్పందించి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆ నోట్లు విసిరిన వ్యక్తి మాజీ కబడ్డీ క్రీడాకారుడని, అతని మానసిక పరిస్థితి బాగాలేదని పోలీసులు తెలిపారు. రూ. 3,000 విలువైన రూ. 10 నోట్లు ఆ వ్యక్తి గాలిలో విసిరినట్లు పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News