Tuesday, January 14, 2025

రాజ్యసభలో నోట్ల కట్ట.. ధన్‌ఖడ్ ఆవేదన

- Advertisement -
- Advertisement -

ఇటీవలి పార్లమెంట్ సమావేశాల సందర్భంగా రాజ్యసభలో కరెన్సీ నోట్ల కట్ట కనిపించడం కలకలం రేపిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ సభ్యుడు అభిషేక్ మను సింఘ్వీకి కేటాయించిన కుర్చీ వద్ద ఆ కరెన్నీ నోట్లను గుర్తించినట్టు రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ ఆ సమయంలో వెల్లడించారు. తాజాగా ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఇదే వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ ఆ డబ్బు తమదంటూ ఎవరూ ముందుకు రాకపోవడం తనను బాధించిందన్నారు.

ఇది మన నైతిక విలువలకు సవాలు వంటిదని పేర్కొన్నారు. రాజ్యసభలో అనేక ఏళ్ల పాటు నైతిక విలువల కమిటీ లేదని గుర్తు చేశారు. 1990ల చివర్లో మాత్రమే రాజ్యసభలో తొలిసారి ఈ కమిటీ ఏర్పాటైందని చెప్పారు. “ రాజ్యసభ ఛైర్మన్‌గా ఒక విషయం మాత్రం చెప్పగలను. సభలో ఉన్నవారు గొప్ప అర్హతలు , అనుభవం కలిగి ఉన్నవారే కానీ , సభ కార్యకలాపాల విషయానికి వస్తే , వేరే వారి మార్గనిర్దేశంలో నడచుకుంటారు” అని విచారం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News