Monday, December 23, 2024

జికె – కరెంట్ అఫైర్స్

- Advertisement -
- Advertisement -

General science questions and answers in telugu

జలాంతర్గామి సింధుధ్వజ్ నిష్క్రమణ
భారత నౌకాదళంలో మూడున్నర దశాబ్దాల పాటు సేవలందించిన ఐఎన్‌ఎస్ సింధుధ్వజ్ సబ్‌మెరైన్ సేవల నుంచి నిష్క్రమించింది.
ప్రధాని చేతుల మీదుగా సీఎన్‌ఎస్ రోలింగ్ ట్రోఫీ అందుకున్న ఏకైక సబ్‌మెరైన్ ఇది.
విశాఖపట్నంలో తూర్పు నౌకాదళం ప్రధాన కేంద్రంలో సింధుధ్వజ్‌కు జులై 17న సాయంత్రం ఘనంగా వీడ్కోలు పలికారు.
తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ బిస్వజిత్ దాస్ గుప్తా ఆధ్వర్యంలో క మిషనింగ్ కార్యక్రమం నిర్వహించారు.
దునగిరి యుద్ధనౌక జాతికి అంకితం
పి17A INS దునగిరిని కోల్‌కతా హుగ్లీ నది వద్ద రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ జులై 15న ప్రారంభించారు.
కోల్ కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఇంజినీర్స్ సంస్థ దీనిని నిర్మించింది.
ప్రాజెక్ట్ 17A కింద రూపొందిస్తున్న యుద్ధ నౌకల్లో ఇది నాలుగోది.
మొదటి ఐఎన్‌ఎస్ నీలగిరిని 2019లో, రెండవ ఐఎన్‌ఎస్ హిమగిరిని 2020లో ప్రారంభించారు.
అలాగే మూడో ఐఎన్‌ఎస్ ఉదయగిరిని 2022మే నెలలో అందుబాటులోకి తేగా ఇప్పుడు తాజాగా నాలుగవ ఐఎన్‌ఎస్ దునగిరి అందుబాటులోకి వచ్చింది.
ఈ ప్రాజెక్టు కింద యుద్ధనౌకలన్నీ దేశీయంగా తయారు చేస్తున్నారు.
రాష్ట్రపతి ఎన్నికలో 99% ఓటింగ్
భారత 15వ రాష్ట్రపతి ఎన్నికల్లో నామినేటెడ్ సభ్యులు, ఎమ్మెల్యేలు మినహా ఎంపీలు పార్లమెంటులో, ఎమ్మెల్యేలు రాష్ట్రాల అసెంబ్లీల్లో దేశవ్యాప్తంగా 31 కేంద్రాల్లో ఓటేశారు
మొత్తం 99% ఓటింగ్ నమోదైనట్టు రిటర్నింగ్ అధికారి పీసీ మోడీ ప్రకటించారు.
727 మంది ఎంపీలు, 9 మంది ఎమ్మెల్యేలకు పార్లమెంటు హౌస్‌లో ఓటింగ్‌కు అనుమతి ఉండగా 8 మంది ఎంపీలు ఓటు వేయలేదు.
776 మంది ఎంపీలు, 4,033 మంది ఎమ్మెల్యేలు కలిపి మొత్తం 4,809 మం దికి గాను 4,754 మంది ఓటేశారు.
ప్రతిభారాయ్‌కి సినారె పురస్కారం
జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, పద్మభూషణ్ డాక్టర్ సి.నారాయణరెడ్డి జాతీయ సాహి త్య పురస్కారాన్ని ఈ ఏడాది ప్రముఖ ఒడియా రచయిత్రి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత ప్రతిభారాయ్‌కి ఇవ్వనున్నారు.
డాక్టర్ సి. నారాయణ రెడ్డి 91వ జయంతి ఉత్సవాల సందర్భంగా జూలై 29న సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతిలో ఆమెకు పురస్కారాన్ని అందజేయనున్నామని సుశీల నారాయణరెడ్డి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి జె. చెన్నయ్య తెలిపారు.
ఈ పురస్కారం కింద 5 లక్షల నగదు, జ్ఞాపిక, సన్మాన పత్రంతో సత్కరిస్తారు.
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయడు చేతుల మీదుగా పురస్కారాన్ని అందిస్తారు.

సింధుధ్వజ్ వివరాలు
బరువు 3,076 టన్నులు
బీమ్ 9.9 మీటర్లు
పొడవు 72.6 మీటర్లు
ఎత్తు 6.6 మీటర్లు
వేగం ఉపరితలంపై గంటకు 11 నాటికల్ మైళ్లు, సాగరంలో 19 నాటికల్ మైళ్లు.
ఆయుధాలు మూడు 9 ఎంఎం, 36 ఎస్‌ఏఎం లాంచర్‌లు, టార్పెడోలు, యాంటీ సబ్‌మెరైన్ టార్పెడోలు.
సామర్థం: ఏకధాటిగా 9,700 కి.మీ దూరం ప్రయాణించగలదు.
240 మీటర్ల లోతులో ఏకధాటిగా 45 రోజులు నీటిలో ఉండగలదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News