Thursday, January 23, 2025

కరెంట్ అఫైర్స్

- Advertisement -
- Advertisement -

 

11వ ర్యాంకులో భారత్
ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల (ఇవి)వినియోగాన్ని వేగంగా అభివృద్ది చేస్తున్న జాబితాలో భారత్ 11వ ర్యాంకును సాధించింది.
ప్రముఖ మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ సంస్థ ఆర్థర్ డి లిటిల్‌కు చెందిన గ్లోబల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ రెడీనెస్ ఇండెక్స్ (గెమ్‌రిక్స్ 2022) ప్రకారం ఇవిలను వేగంగా అడాప్ట్ చేసుకుంటున్న దేశాల్లో నార్వే అగ్రస్థానంలో నిలిచింది.
ఈ జాబితాని మార్కెట్, వినియోగదారులు, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వం వంటి నాలుగు అంశాల ఆధారంగా రూపొందించారు.
తెలంగాణ హైకోర్టు సిజెగా జస్టిస్ ఉజ్జల్
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణ స్వీకారం చేశారు.
జూన్ 28న రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆయనతో ప్రమాణం చేయించారు.
ఇప్పటివరకు సీజేగా బాధ్యతలు నిర్వహించిన జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ ఢిల్లీ హైకోర్టుకు బదిలీ అయ్యారు.
సీజేగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ పేరును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణ నేతృత్వంలోని కొలీజియం మే7న సిఫారసు చేసింది.

మిషన్ ఒలింపిక్ సెల్‌లో నారంగ్
భారత షూటర్, లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత గగన్ నారంగ్‌కు స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)కీలక బాధ్యతలు అప్పగించింది. సాయ్ ఆధ్వర్యంలోని మిషన్ ఒలింపిక్ సెల్ (ఎంఓసీ)లో సభ్యుడిగా నారంగ్‌ను ఎంపిక చేసింది.
ప్రతిభావంతులైన ఆటగాళ్లను గుర్తించి వారిని ఒలింపిక్స్‌కు సన్నద్ధం చేసే కార్యక్రమంలో భాగంగా 2o14 నుంచి టార్గెట్ ఒలింపిక్ పోడి యం స్కీమ్ (టాప్స్)పనిచేస్తుంది.
టాప్స్ కోసం ఆటగాళ్లను గుర్తించడం, వారి సన్నహకాలకు ఆర్థిక పరంగా సహకారం అందించే విషయంలో తగిన సూచనలు, సలహాలు అందించడంతోపాటు ఫలితాలను పర్యవేక్షించడమే మిషన్ ఒలింపిక్ సెల్ బాధ్యత.
గెయిల్ కొత్త చైర్మన్ సందీప్ కె గుప్తా
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో ఫై నాన్స్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సందీప్ కుమార్ గుప్తా, భారత్ అతిపెద్ద గ్యాస్ యుటిలిటీ సంస్థ గెయిల్ చీఫ్‌గా ఎంపికయ్యారు. పది మందిని ఇంటర్వూ చేసిన తర్వాత 56 ఏళ్ల గుప్తాను గెయిల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సిఎండీ)గా ఎంపికచేసినట్లు ప్రభుత్వ రంగ సంస్థల నియామకాల ఎంపిక బోర్డ్ ఒక ప్రకటనలో తెలిపింది.
మహారాష్ట్ర 20వ సిఎంగా షిండే
మహారాష్ట్ర నూతన ముక్యమంత్రిగా శివసేన రెబెల్ నాయకుడు ఏక్‌నాథ్‌షిండే, ఉప ముఖ్యమంత్రిగా బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణ స్వీకారం చేశారు.
రాజ్ భవన్‌లో గవర్నర్ భగత్‌సింగ్ కోషియారీ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు.
మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ)ప్రభుత్వం కూలిపోయిన 24 గంటల్లోనే.. అంచనాలు తలకిందులు చేస్తూ శివసేన తిరుగుబాటు వర్గం బీజేపీ కలసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.
తొలి గ్రీన్ టాయిలెట్ రైలు
దక్షిణ మధ్య రైల్వే విజయవాడలో అత్యుత్తమ సేవలు అందిస్తున్న రైళ్లలో పినాకిని ఇంటర్‌సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ప్రధానమైనది.
భారతదేశంలోనే తొలి గ్రీన్ టాయిలెట్లు కలిగిన రైలు ఇది. ఈ రైలు విజయవాడ నుంచి తమిళనాడులోని చెన్నై నగరం మధ్య ప్రతి రోజు వేల సంఖ్యలో ప్రయాణికులను తరలిస్తుంది.
పినాకిని ఎక్స్‌ప్రెస్ రైలు సేవలు జులై 1వ తేదీతో 30 ఏళ్లు పూర్తి చేసుకుంది.
ఈ రైలు 1992 జులై ఒకటో తేదీన 2711/ 2712 నంబర్లతో విజయవాడ చెన్నైల మధ్య ప్రారంబించారు.
నెల్లూరు జిల్లా నెన్నానది మీదుగా రాకపోకలు సాగిస్తుండడంతో ఈ రైలుగకి పినాకిని అని పేరు పెట్టారు.
2010 నుంచి 12711/12712 నంబర్లతో ఈ రైలు నడుస్తుంది.
ఈ రైలు పూర్తిగా సిట్టింగ్ సదుపాయం కలిగి.. ప్రారంభంలో 18 కోచ్‌లు ఉండ గా..ఇప్పుడు 24 కోచ్‌లతో నడుస్తుంది.
పిఎస్‌ఎల్‌వి-సి53 ప్రయోగం
భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో) తిరుపతి జిల్లా సతీస్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగవేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ53 ఉపగ్రహ వాహకను జూన్ 30న విజయవంతంగా ప్రయోగించారు.
షార్ కేంద్రం నుంచి ఇది 81వ ఉపగ్రహం.
పీఎస్‌ఎల్‌వి సిరీస్‌లో ఇది 55వ ప్రయోగం.
ఈ ప్రయోగంలో 522.8 కిలోల బరువున్న మూడు ఉపగ్రహాలను భూమికి 570 కి.మీ ఎత్తులోని సన్ సింక్రనస్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టారు.
న్యూ స్పేస్ ఇండియాలో లిమిటెడ్ ఆధ్వర్యంలో వాణిజ్యపరమైన ప్రయోగాలే లక్షంగా పెట్టుకున్నామని ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు.
ఉద్యమి భారత్ కార్యక్రమం..
జూన్ 30న ఉద్యమి భారత్ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు.
చిన్న వ్యాపార సంస్థలు, ఎంఎస్‌ఎంఈలు మరిన్ని ఎగుమతులు చేసేందుకు వీలుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు ప్రధాని తెలిపారు.
దేశ ఎగుమతులు పెరిగేందుకు, మరిన్ని మార్కెట్లకు భారత ఉత్పత్తులు చేరుకునేందుకు ఎంఎస్‌ఎంఈ రంగం బలంగా ఉండాలన్నారు.

జి-7 సదస్సు ముఖ్యాంశాలు
జర్మనీలో ఇటివలె జరిగిన జి7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యావరణ పరిరక్షణకు, సంబంధిత వాగ్దానాలకు భారత్ పూర్తిగా కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.
జూన్ 27న జి7 శిఖరాగ్ర సదస్సులో వాతావరణ మార్పులు, ఇంధనం తదితరాలపై జరిగిన భేటీలో ప్రధాని మాట్లాడారు.
ఇంధన సామర్ధంలో 40 శాతాన్ని శిలాజేతర వనరుల నుంచి సమకూర్చుకోవాలన్న లక్ష్యాన్ని గడువుకు 9 ఏళ్ల ముందే సాధించామని మోడీ తెలిపారు.
ఉక్రెయిన్‌పై దురాక్రమణకు పాల్పడుతున్న రష్యాను ఆర్థికంగా కోలుకోలేని విధంగా దెబ్బతీయాలని జి7 దేశాధినేతలు ప్రతినబూనారు.
రష్యా దాడులు కొనసాగినంత కాలం ఉక్రెయిన్‌కు మద్దతివ్వాలని ఐక్యంగా తీర్మానించారు. జర్మనీలో జరుగుతున్న జి7 నేతల సదస్సు జూన్ 28తో ముగిసింది.

పైలెట్ రహిత విమానం..

రక్షణ రంగ సంస్థ డిఆర్‌డిఓ తన తొలి మానవ రహిత విమానాన్ని విజయవంతంగా ప్రయోగించింది.
కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్‌లో జులై 1న ఈ పరీక్ష చేపట్టింది.
పైలట్ లేకుండా ఎగిరిన ఈ విమానం ల్యాండింగ్ కూడా విజయవంతంగా ముగించింది.
ఇది పూర్తిగా సెల్ఫ్ కంట్రోల్ డ్రైవింగ్‌తో పనిచేస్తుంది.

టి-హబ్ రెండోదశ ప్రారంభం
ఆలోచనలతో రండి ఆవిష్కరణలతో వెళ్లండి అనే నినాదంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టిహబ్ రెండో దశను సిఎం కెసిఆర్ జూన్ 28న ప్రారంభించారు.
400 కోట్ల రూపాయల వ్యయంతో హైదరాబాద్‌లోని మాదాపూర్ రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్‌గా ఈ టీహబ్ 2.0 ను నిర్మించారు.
ఇన్నోవేషన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం తొలిసారి 2015లో టిహబ్‌ను ఏర్పాటు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News