Saturday, November 23, 2024

మన చేతుల్లోనే విద్యుత్ మీటర్ రీడింగ్ యాప్‌తో….

- Advertisement -
- Advertisement -

మీటర్ రీడింగ్‌ల గందరగోళానికి చెక్

Current meter reading app in Telangana

మన తెలంగాణ,సిటీబ్యూరో: విద్యుత్ సిబ్బంది గడువుదాటిని మీటర్ రీడింగ్ తీసుకోలేదని ఆందోళన పడే విద్యుత్ వినియోగదారులకు ఇక నుంచి వారికి ఆందోళన అవసరం లేదు. ఎవరి ఇంటి మీటర్ రీడింగ్‌ను వారే తీసుకునేందుకు విద్యుత్‌శాఖ సెల్ఫ్‌రీడింగ్ విధానాన్ని అమలు చేస్తోంది. కరోనా అందరి అందరి జీవితాల్లో మార్పులను తీసుకు వచ్చింది. కరోనా సమయంలో మీటర్ రీడింగ్ సిబ్బందిని సైతం ఇంటింటికి వెళ్ళి విద్యుత్ మీటర్ రీడింగ్ తీయలేని పరిస్దితి నెలకొన్న సంగతి తెలిసిందే.

ఇటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకున్న అధికారులు అందుబాటులో ఉన్న టెక్నాలజిపై దృష్టి సారించారు. ఇందులో భాకంగా విద్యుత్ బిల్లింగ్ కోసం ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించి అమల్లోకి తెచ్చింది. గతంలో కరెంటు బిల్లు రెండు నెలలకు ఒకసారి తీయడంతో పెద్దమొత్తంలో విద్యుత్ బిల్లులు వచ్చిన సంగతి తెలిసిందే. ఇటువంటి పరిస్థితిని అధికమించేందుకు డిస్కంలు ఒక యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ముఖ్యంగా రాష్ట్రంలో తెలంగా ఎస్‌పిడీసీఎల్ అందుబాటులోకి తీసుకు రాగా అనంతరం సదరన్ పవర్‌కార్పోరేషన్ లిమిటెడ్ కూడా తాజాగా అందుబాటులోకి తీసుకు వచ్చింది.

విద్యుత్ వినియోగదారులు ముందుగా టిఎస్‌ఎస్‌పిడీసీఎల్ ఐటీ వింగ్ లేదా భారత్ మీటర్ రీడింగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అనంతరం ఓపెన్ చేసిన దానిలోలో కన్సూమర్ మీటర్ రీడింగ్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. వినియోగదారులు యూనిక్ సర్వీస్ నంబర్ లేదా మొబైల్ నంబర్, ఈమెయిల్‌ను అడ్రస్‌ను నమోదు చేసుకోవాలి. దాని తర్వాత అందులో ఉండే స్కాన్ కే డబ్లూ హెచ్ రీడింగ్‌ను ఎంపిక చేసి మీటర్‌లోని రీడింగ్ స్కాన్ చేసి సబ్‌మిట్ అని క్లిక్ చేయాలి. దీంతో మీరు తీసిని విద్యుత్ మీటర్ రీడింగ్ ఫోటో సంబంధిత విద్యుత్ అధికారులకు వెళుతుంది.

అన్ని సక్రమంగా ఉంటే మీరు ఎంటర్ చేసిన ఫోన్ నంబర్‌కు అధికారులు విద్యుత్ బిల్లులను ఎస్‌ఎంఎస్ రూపంలో పంపిస్తారు. బిల్లు వచ్చిన అనంతరం అంందులోనే చెల్లించుకునే అవకాశం కూడా కల్పించారు. ఇక మీటర్ రీడింగ్ కూడా రెండు మూడు సార్లు తీసేందుకు అవకాశం లేదు. మీకంటే ముందే ఎవరైనా స్కాన్ చేసి ఉంటే యాప్‌లో ఇట్టే తెలిసిపోతుంది. ప్రస్తుత నెలలో స్పాట్‌బిల్లింగ్ సిబ్బంది ఇంటికి వచ్చి మీటర్ రీడింగ్ తీయక పోతే రెండు రోజులు వేచి చూసి అ తర్వాత సెల్ప్ బిల్లింగ్ సదుపాయాన్ని వాడుకోవాలని అధికారులు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News