- Advertisement -
పాట్నా: ఓ గ్రామంలో ప్రతి రోజు రాత్రి సమయంలో కరెంట్‌పోతుండడంతో గ్రామస్థులకు పలుమార్లు అనుమానం కలిగింది. కరెంట్ పోయినప్పుడు రెండు బైక్‌లు, కరెంట్ మోటార్లు, పలు మేకలను దొంగలించారు. గ్రామస్థులకు అనుమానం రావడంతో కరెంట్ సరఫరా నిలిపివేసే దొంగలను పట్టుకోవాలనుకున్నారు. ఓ యువతి ట్రాన్స్‌ఫార్మర్ వద్దకు వెళ్లి విద్యుత్ సరఫరాను నిలిపివేసిన అనంతరం తన ప్రియుడితో కలిసి ఏకాంతంగా గడుపుతుండగా గ్రామస్థులు పట్టుకొని యువకుడికి దేహశుద్ధి చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి ఇద్దరికి పెళ్లి చేశారు. దీంతో కరెంట్ ప్రేమకథకు శుభం కార్డు పడింది.
Also Read: రైల్వే ప్రయాణికులకు శుభవార్త
- Advertisement -