Sunday, December 22, 2024

అవినాశ్ రెడ్డికి కస్టోడియాల్ ఇంటరాగేషన్ అవసరమా?: సుప్రీం

- Advertisement -
- Advertisement -

 

ఢిల్లీ: తెలంగాణ హైకోర్టు ఎంపి అవినాశ్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇచ్చే సమయంలో పలు అంశాలను పరిగణలోకి తీసుకోలేదని సునీతారెడ్డి సుప్రీంకోర్టుకు తెలిపారు. సిబిఐ సేకరించిన సాక్షాలను పరిగణలోకి తీసుకోలేదని, అత్యున్నత న్యాయస్థానం చెప్పిన అంశాలకు విరుద్ధంగా అవినాశ్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరూ చేశారని తన గోడు వెల్లబోసుకున్నారు. సిబిఐ దర్యాప్తుకు అవినాశ్ ఏమాత్రం సహకరించడంలేదని, మూడు సార్లు నోటీసులు ఇచ్చినా ఆయన సిబిఐ ఎదుట హాజరు కాలేదని, మొత్త పరిణామాల నేపథ్యంలోనే అవినాశ్ ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరతున్నామని సునీతా తెలిపారు.

అవినాశ్ కస్టోడియాల్ ఇంటరాగేషన్ అవసరమా? అని సుప్రీం బెంచ్ ప్రశ్నించింది. ఆయన విచారణకు సహకరిస్తున్నారా? అన్నది దర్యాప్తు సంస్థ వ్యవహారమని బెంచ్ తెలిపింది. సుప్రీం కోర్టు సెలవుల అనంతరం పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తామని బెంచ్ పేర్కొంది.

సునీతా: వివేకా మర్డర్ కేసు ఈ నెల 30 లోగా ముగించాలని, సుప్రీంకోర్టు స్వయంగా చెప్పిందని గుర్తు చేశారు. ఈలోగా ఈ పిటిషన్‌పై విచారణ జరపాల్సిన అవసరం ఉంది

బెంచ్: ఇంకో ధర్మాసనం పెట్టిన డెడ్‌లైన్‌ను తాము మార్చలేము. దర్యాప్తు సంస్థకు తన వాదన వినిపించే అవకాశం ఇవ్వండని, అది ఆ సంస్థ ఇష్టమని, అందుకే జులై 3కు విచారణ వాయిదా వేస్తాం

సునీత: హైకోర్టు గతంలో ఇచ్చి ఆదేశాలను కూడా తప్పుబట్టింది.

బెంచ్: నోటీసులు ఇచ్చేందుకు తాము సిద్ధంగా లేము, పిటిషనర్ కోరినందుకు జూన్ 19న తదుపరి విచారణ చేపడతాం

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News