Wednesday, January 22, 2025

కస్టడీ మరణాలు గుజరాత్‌లోనే అధికం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : పోలీస్ కస్టడీ మరణాల్లో గుజరాత్ దేశం లోనే మొదటి స్థానంలో ఉంది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ మంగళవారం లోక్‌సభలో ఈ వివరాలు వెల్లడించారు. 2018 ఏప్రిల్ నుంచి 2023 మార్చి వరకు జాతీయ మానవ హక్కుల కమిషన్ అందించిన వివరాలను ఉదహరిస్తూ ఈ ఐదేళ్ల కాలంలో దేశ వ్యాప్తంగా 687 మంది పోలీస్ కస్టడీలో మృతి చెందినట్టు మంత్రి తెలిపారు. ఒక్క గుజరాత్ లోనే 81 మరణాలు నమోదయ్యాయని, మహారాష్ట్రలో 80, మధ్యప్రదేశ్‌లో 50, బీహార్‌లో 47, ఉత్తరప్రదేశ్‌లో 41, తమిళనాడులో 36 మరణాలు సంభవించాయి. దేశంలో జైళ్లలో మగ్గుతోన్న విచారణ ఖైదీల సంఖ్య 2021 డిసెంబర్ నాటికి 4.27 లక్షలకు చేరిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా లిఖిత పూర్వకంగా తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News