Friday, December 20, 2024

స్టైల్, యాక్షన్, సెంటిమెంట్, మాస్ ఉన్నసినిమా..

- Advertisement -
- Advertisement -

యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య, లీడింగ్ ఫిల్మ్‌మేకర్ వెంకట్ ప్రభుల తెలుగు-, తమిళ ద్విభాషా ప్రాజెక్ట్ ’కస్టడీ’ మోస్ట్ ఎవైటెడ్ మూవీస్‌లో ఒకటి. కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. ఈనెల 12న సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ‘కస్టడీ’ ప్రీరిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో హీరో నాగచైతన్య మాట్లాడుతూ “అరవింద్ స్వామి ఈ కథకి ఓకే చెప్పడంతో మా అందరికీ సినిమాపై చాలా నమ్మకం వచ్చింది.

ఈ చిత్రంతో కృతి శెట్టి కెరీర్ మరో స్థాయికి వెళుతుందని నమ్ముతున్నాను. అబ్బూరి రవి పవర్‌ఫుల్ డైలాగ్స్ ఇచ్చారు. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం బ్లాక్‌బస్టర్. సినిమా మొదటి ఇరవై నిమిషాలు కూల్‌గా వెళ్తుంది. ఇంటర్వెల్‌కి ముందు నుంచి థియేటర్ లో బ్లాస్ట్ అవుతుంది. అద్భుతమైన యాక్షన్స్ సీక్వెన్స్ లు వుంటాయి. సినిమాలో మీరు కొత్త చైని చూడబోతున్నారు. వెంకట్ ప్రభు అలా డిజైన్ చేశారు”అని అన్నారు. దర్శకుడు వెంకట్ ప్రభు మాట్లాడుతూ “కస్టడీ చిత్రంలో స్టైల్, యాక్షన్, పర్‌ఫార్మెన్స్, సెంటిమెంట్, మాస్… ఇలా అన్నీ వున్నాయి. నాగచైతన్య నన్ను బలంగా నమ్మారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాననే నమ్మకం ఉంది”అని తెలిపారు. ఈ ఈవెంట్‌లో కృతి శెట్టి, శ్రీనివాస చిట్టూరి, పవన్ కుమార్, ప్రియమణి, అబ్బూరి రవి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News