Monday, December 23, 2024

ఎప్పుడు నిరాశ చెందకుండా ప్రయత్నిస్తే విజయం సాధిస్తాం:నాగచైతన్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్‌లో జరిగిన వార్షికోత్సవానికి హీరో నాగచైతన్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జీవితంలో ఎప్పుడు నిరాశ చెందకుండా ప్రయత్నిస్తే విజయం సాధిస్తామని అన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో అడ్డంకులు వస్తాయని వాటికి భయపడకుండా ముందుకు సాగాలని అన్నారు. లక్ష్యాన్ని ఎంచుకొని లక్ష సాధన దిశగా విద్యార్థులు ప్రయత్నించాలని అన్నారు. ఎటువంటి సందర్భంలోనైనా విద్యార్థులు నిరాశ, నిస్పృహలకు లోనుకావద్దని అన్నారు.

ఈ సందర్భంగా హీరో నాగచైతన్య నటించిన కస్టడీ సీనిమా టీజర్‌ను విడుదల చేశారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ గోపాల్‌రెడ్డి, కార్యదర్శి వసంతలతా, సీఈఓ అభినవ్‌రెడ్డి, డైరెక్టర్ రాజిరెడ్డి, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News