హైదరాబాద్: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై ఎసిబి కోర్టు తీర్పు వెల్లడించింది. చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ ఈ నెల 24 వరకు పొడిగించింది. హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాష్ పిటిషన్ తీర్పుపై ఎసిబి కోర్టు ఆరా తీసింది. క్యాష్ పిటిషన్ తీర్పు రిజర్వ్ నేపథ్యంలో కస్టడీపై సందిగ్ధత నెలకొంది. క్యాష్ పిటిషన్‌కు, కస్టడీ పిటిషన్‌కు సంబంధం లేదని సిఐడి పేర్కొంది. రిమాండ్ సమయం ముగియడంతో చంద్రబాబును కోర్టు ముందు పోలీసులు హాజరుపరిచారు. చంద్రబాబును వర్చువల్‌గా కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. సిఐడి కస్టడీపై చంద్రబాబు అభిప్రాయాన్ని న్యాయమూర్తి కోరారు. చంద్రబాబు సిఐడి కస్టడీ పిటిషన్‌పై తీర్పు మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా పడింది. విజయవాడ ఎసిబి కోర్టు తీర్పును మధ్యాహానికి వాయిదా వేసింది.
Also Read: మహిళా ఎస్‌ఐకి వేధింపులు: ఇద్దరు కానిస్టేబుల్స్ సస్పెండ్