Friday, December 20, 2024

ముంబై ఎయిర్‌పోర్టులో రూ.8.68 కోట్ల విలువైన బంగారం పట్టివేత

- Advertisement -
- Advertisement -

ముంబై లోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు రూ.8.68 కోట్ల విలువైన 10.6 కిలోల బంగారాన్ని, ఎలెక్ట్రానిక్స్‌ను, 31 కేసుల్లో విదేశీ కరెన్సీని పట్టుకున్నారు. ఈ పట్టివేతకు సంబంధించి గత నాలుగు రోజుల్లో ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈమేరకు ముంబై కస్టమ్స్ జోన్ 3 ప్రకటన విడుదల చేసింది. ముడి ఆభరణాలు, బంగారం కడ్డీలు, మైనంలో బంగారం పొడి తదితర విభిన్న రూపాల్లో బంగారాన్ని స్మగ్లింగ్ చేయడాన్ని అధికారులు గమనించారు. ఇవన్నీ ఎలెక్ట్రిక్ ఇరన్‌లోను, ప్రయాణికుని శరీరంలోను దాచి ఉంచారు. నాలుగు సంచుల్లో మైనంలో బంగారం పొడి దాచి ఉంచిన విమానాశ్రయ కాంట్రాక్టు సిబ్బందిని కూడా అధికారులు పట్టుకున్నారు. దీని విలువ రూ.81.8 లక్షలు. మరో కేసులో బహ్రెయిన్,

మాలే నుంచి వచ్చిన ఇద్దరు భారతీయుల నుంచి వారి శరీరంలో మైనంలో దాచి ఉంచిన 1890 గ్రాముల బంగారం పొడిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నాలుగు రోజుల ఆపరేషన్‌లో నైరోబి, కొలంబో, దుబాయ్ నుంచి వచ్చిన ఐదుగురు విదేశీయులతోపాటు దుబాయ్, జెడ్డా, షార్జా, సింగపూర్ నుంచి వచ్చిన 14 మంది భారతీయుల నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి ప్రయాణించిన ఎనిమిది మంది భారతీయులు అత్యంత ఖరీదైన మొబైల్ ఫోన్లు, లాప్‌టాప్‌లు, కాస్మోటిక్స్‌ను పట్టుకున్నారు. వీటి విలువ రూ.1.95 కోట్లు. ముంబై నుంచి దోహాకు వెళ్తున్న ఒక ప్రయాణికుని నుంచి రూ.17.5 లక్షల విలువైన 74,000 కతారీ రియాల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News