Monday, January 20, 2025

పెరుగు అడిగిన కస్టమర్‌పై దాడి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, సిటిబ్యూరోః పెరుగు అడిగిన కస్టమర్‌పై హోటల్ సిబ్బందిపై దాడి చేయడంతో మృతిచెందిన సంఘటన పంజాగుట్టలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…చాంద్రాయణగుట్టకు చెందిన లియాకత్ బిర్యానీ తినేందుకు పంజాగుట్టలోని మెరీడియన్ రెస్టారెంట్‌కు ఆదివారం రాత్రి వచ్చాడు. బిర్యానీ తిన్న తర్వత ఎక్స్‌ట్రా పెరుగు ఇవ్వాల్సిందిగా అక్కడి సిబ్బందిని అడిగారు. దీంతో సిబ్బంది, లియాకత్ మధ్య వాగ్వాదం జరిగింది. ఇది ఎక్కువ కావడంతో హోటల్ సిబ్బంది లియాకత్‌పై దాడి చేశారు.

ఈ విషయం తెలుసుకున్న పంజాగుట్ట పోలీసులు రెస్టారెంట్‌కు వచ్చారు. పోలీసులను చూసిన బాధితుడు తనను చంపివేస్తున్నారని కాపాడాలని పోసులను వేడుకున్నాడు. అయినా కూడా హోటల్ సిబ్బంది దాడి చేయడం ఆపలేదు. వారి నుంచి తప్పించేందుకు లియాకత్‌ను పోలీసులు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తీసుకుని వచ్చారు. స్టేషన్‌కు వచ్చిన తర్వాత బాధితుడు కొద్దిసేపట్లోనే కుప్పకూలాడు, వెంటనే పోలీసులు ఆస్పత్రికి తీసుకుని వెళ్లగా పరిశీలించిన వైద్యులు మృతిచెందినట్లు చెప్పారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. గతంలో కూడా మెరీడియన్ సిబ్బంది వినియోగదారులపై విచక్షణ రక్షణంగా దాడులు చేసినట్లు తెలిసింది. చాలా గొడవలు పోలీస్ స్టేషన్ వరకు రాకపోవడంతో బయటపడనట్లు తెలిసింది. తమకు న్యాయం చేయాలని, లియాకత్‌పై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.

రోడ్డుపైనే పార్కింగ్….
పంజాగుట్ట ప్రధాన రహదారిపై ఉన్న మెరీడియన్ రెస్టారెంట్ పార్కింగ్ ప్రాంతం చిన్నగా ఉండడంతో హోటల్‌కు వచ్చిన కస్టమర్లు తమ వాహానాలను రోడ్డుపై నిలుపుతున్నారు. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోంది, ఈ విషయంపై పలుమార్లు ఫిర్యాదులు వస్తున్నా కూడా పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. జిహెచ్‌ఎంసి అడ్డగోలు అనుమతులతో రోడ్లపై తీవ్ర ట్రాఫిక్ అంతరం ఏర్పడుతోందని దీనిపై ట్రాఫిక్ పోలీసులను నిందించడం సరికాదని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News