Monday, December 23, 2024

ఇంత ఆలస్యంగా వస్తావా..?: డెలివరీ బాయ్ కాలు విరగొట్టిన కస్టమర్..

- Advertisement -
- Advertisement -

డెలివరీ బాయ్ ఆలస్యంగా వచ్చినందుకు ఓ కస్టమర్ అతని కాలు విరగొట్టాడు. ఈ ఘటన నగరంలోని కుత్బుల్లాపూర్ లో చోటుచేసుకుంది. ఆగస్టు 5న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశాల్ గౌడ్ అనే కస్టమర్ బుక్ చేసిన ఆర్డర్ ను డెలివరీ చేసేందుకు కుత్బుల్లాపూర్ వెళ్లిన షేక్ రహన్ ఫయాజ్(20) డెలివరీ బాయ్ కి రూట్ తెలియక ఆలస్యంగా వెళ్లాడు.

దీంతో కోపొద్రిక్తుడైన విశాల్ గౌడ్ తన స్నేహితులతో కలిసి డెలివరీ బాయ్ పై దాడి చేశాడు. రూమ్ లో బంధించి అతన్ని చితకబాది కాలు విరగొట్టారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిపై లీగల్ యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News