Sunday, January 12, 2025

పన్ను విషయంలో బ్యాంకు మేనేజర్ ను  చితకబాదిన కస్టమర్

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: యూనియన్ బ్యాంక్ లో మేనేజర్ కు, కస్టమర్ కు మధ్య పన్ను(tax) కోత విషయంలో గొడవ జరిగింది. ఫిక్స్ డ్ డిపాజిట్ మీద పన్ను కోతను పెంచడంపై కస్టమర్ జైమన్ రావల్ రెచ్చిపోయాడు. వాగ్వాదానికి దిగాడు.  తర్వాత బ్యాంకు ఉద్యోగిని చెంప దెబ్బ కొట్టాడు. దీని వీడియో ఇప్పుడు వైరల్ అయింది.  ఇదంతా అహ్మదాబాద్ కు చెందిన వస్త్రపూర్ లోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ లో జరిగింది. వస్త్రపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

ఇలాంటి ఘటనే పాట్నాలోని గాంధీ మైదాన్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న కెనరా బ్యాంక్ బ్రాంచ్ లో కూడా జరిగింది. సిబిల్ స్కోర్ విషయంలో ఓ కస్టమర్ మహిళా బ్యాంక్ మేనేజర్ ను వేధించాడు. కస్టమర్ ఆమెకు వేలు చూపుతూ హెచ్చరించడమేకాక, ఆమె చేతిలోని ఫోన్ లాక్కుని కింద పడేశాడు. ‘‘నన్ను వేధించడానికి రికార్డు చేస్తావా?’’ అని నిలదీశాడు. ‘‘నీకెవరు మద్దతు ఇవ్వరు. నా సిబిల్ స్కోరు సరిచేయి. నీ క్యాబిన్ లో  నిన్నేమి చేస్తానో చూడు. నీవు ఎవరితో పెట్టుకుంటున్నావో నీకు తెలియదు. నీవు నాకు చాలా అన్యాయం చేశావు’’ అంటూ కస్టమర్ రెచ్చిపోయాడు. ఇదంతా చూస్తుంటే పన్నుల కోత, సిబిల్ స్కోరు వంటి విషయాల్లో కొత్తగా ఏమి జరుగుతోంది అన్న ఆవేదన కలుగుతోంది. మన ప్రమేయం లేకుండానే బ్యాంకులు ఛార్జీలు బాదేస్తున్నాయా? అనిపిస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News