Wednesday, January 15, 2025

ల్యాప్‌టాప్ బుక్ చేస్తే… పార్శిల్‌లో రాయి…!

- Advertisement -
- Advertisement -

Customer gets stone instead of laptop in Mangaluru

బెంగళూరు : మంగుళూరుకు చెందిన వ్యక్తి ఈ కామర్స్ వెబ్‌సైట్‌లో ల్యాప్‌టాప్ ఆర్డర్ చేయగా… పార్శిల్ కవర్లో రాయి, కొంత ఎలక్ట్రానిక్ వ్యర్ధాలు వచ్చాయి. ఎట్టకేలకు అతి కష్టం మీద తన డబ్బును తిరిగి పొందాడు. దీపావళి ఆఫర్లు ఉన్నాయన్న ఉద్దేశంతో కర్ణాటక లోని మంగళూరు వ్యక్తి తన స్నేహితుడి కోసం అక్టోబర్ 15న ప్రముఖ ఈ కామర్స్ వెబ్‌సైట్‌లో ల్యాప్‌టాప్ ఆర్డర్ చేశాడు. తీరా పార్శిల్ వచ్చాక తెరచి చూస్తే అందులో రాయి, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు ఉన్నాయి. వెంటనే కస్టమర్ కేర్‌కి ఫోన్ చేసి సమస్యను చెప్పినా తొలుత ఉపయోగం లేకపోయింది. ఎట్టకేలకు అతికష్టం మీద డబ్బును తిరిగి పొందాడు. దీనికి సంబంధించిన ఫోటోలను సదరు వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా వైరల్‌గా మారాయి.

ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువ కావడంతో ఈ కామర్స్ సంస్థలు ‘ఓపెన్ బాక్స్ డెలివరీ’ ఆప్షన్‌ను తీసుకొచ్చాయి. కస్టమర్ కోరితే ఐటమ్ డెలివరీ చేసే ముందు డెలివరీ చేసే వ్యక్తి పార్శిల్‌ను తెరచి చూపించాల్సి ఉంటుంది. అయితే ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసినప్పుడే వినియోగదారుడు ఈ ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. తాజా ఘటనలో ఆ వ్యక్తి ఓపెన్ బాక్స్ డెలివరీ ఆప్షన్‌ను ఎంచుకోలేదు. పార్శిల్‌లో రాయి వచ్చిందన్న సంగతి గమనించి వెంటనే అమ్మకం దారుడికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. అయితే ఓపెన్ బాక్స్ డెలివరీ ఎంచుకోనందున రిఫండ్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పడంతో తాను ఆర్డర్ చేసిన ఈ కామర్స్ సంస్థకు ఫిర్యాదు చేశాడు. అన్ని ఆధారాలు జత చేస్తూ ఈ మెయిల్ చేశాడు. సదరు ఈ కామర్స్ సంస్థ జోక్యం చేసుకోవడంతో మొత్తం సొమ్ము రిఫండ్ వచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News