Wednesday, January 22, 2025

వ్యాపారంలో వినియోగదారుడే కీలకం

- Advertisement -
- Advertisement -

వరల్డ్ మెట్రాలజీ డేలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్

Customer is key in business
మనతెలంగాణ/ హైదరాబాద్ : ఒక్కరి లాభం కోసం వేలాది మంది వినియోగదారులకు అన్యాయం చేసే వ్యాపారుల ఆలోచనలు సమాజానికి శ్రేయస్కరం కాదని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. వరల్డ్ మెట్రాలజీ డే సందర్భంగా శుక్రవారం రెడ్‌హిల్స్‌లోని ఎఫ్‌టిసిసిఐలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారులకు మెరుగైన సేవలను వివిధ రంగాల్లోని వ్యాపారులు అందించాలని, ఇదే గొప్ప మానవ సేవ అన్నారు. వినియోగదారుల మన్ననలు పొందే విధంగా వ్యాపార వ్యవహారాలు ఉండాలని, అంతిమంగా వినియోగదారుడే ఆయా వ్యాపారాలకు కీలకం అన్న వాస్తవాన్ని విస్మరించ వద్దు అని సూచించారు. తూనికలు, కొలతల పట్ల వినియోగదారులకు ఎల్లప్పుడూ పలు అనుమానాలు ఉండే అవకాశాలు ఉంటాయని, అలాంటి అనుమానాలకు తావు ఇవ్వకుండా ఆయా రంగాల వ్యాపారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వినోద్‌కుమార్ అన్నారు.

వ్యాపారులకు ఆయువుపట్టు వినియోగదారుడేనని, వారి అభిమానాన్ని చురగొనాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా వ్యాపారులు తమ దైనందిన విధానాలను మార్చుకోవాలని వినోద్‌కుమార్ సూచించారు. డిజిటలైజేషన్ అప్‌డేట్స్ కావాలని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని పెంపొందించుకోవాలని సూచించారు. ప్రతి వ్యాపారానికి వినియోగదారుడే వెన్నెముక అని, అలాంటి వినియోగదారులను జాగ్రత్తగా, అభిమానంతో కాపాడుకోవాలని, ఇది వ్యాపారుల కర్తవ్యం అని వినోద్‌కుమార్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్‌టిఐ కమిషనర్ అమీర్, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ మన్యుఫ్యాక్చరర్స్, డీలర్స్, అండ్ రిపేర్స్ ( తాందార్ ) సంఘం అధ్యక్షులు మహమ్మద్ రబ్బాని, కార్యదర్శి ప్రసాద్, సంయుక్త కార్యదర్శి అజిత్ గుప్తా, ఉపాధ్యక్షుడు గిరిధర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News