Monday, January 20, 2025

హైదరాబాద్‌ హోటల్ లో పెరుగు అడిగినందుకు చంపేశారు….

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిర్యానీ కోసం ఎక్స్‌ట్రా పెరుగు చట్నీ కావాలని అడిగిన కస్టమర్‌ను హోటల్ సిబ్బంది కత్తితో పొడిచి చంపారు. హైదరాబాద్‌లోని పంజాగుట్టలో ఉన్న మెరిడియన్ రెస్టారెంట్‌లో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.

అర్ధరాత్రి రెస్టారెంట్‌లో బిర్యానీ తింటున్న లియాఖత్ అనే వ్యక్తి ఎక్స్‌ట్రా పెరుగు చట్నీ కావాలని హోటల్ సిబ్బందిని అడిగాడు. అందుకు నిరాకరించిన సిబ్బంది కస్టమర్‌తో వాగ్వాదానికి దిగారు. గొడవ ముదిరిపోవడంతో హోటల్ సిబ్బందిలో ఒకడు లియాఖత్‌ను కత్తితో పొడిచాడు.

తనపై జరిగిన కత్తి దాడి గురించి ఫిర్యాదు చేయడానికి సమీపంలోనే పంజాగుట్ట పోలీసు స్టేషన్‌కు లియాఖత్ వెళ్లాడు.పోలీసులకు ఘటన గురించి వివరిస్తున్న సమయంలో అతను కుప్పకూలిపోయాడు. వెంటనే లియాఖత్‌ను సమీపంలోని ఆసుపత్రికి పోలీసులు తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. పోస్టు మార్టమ్ నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఘటన గురించి సమాచారం అందుకున్న ఎంఐఎం ఎంఎల్‌సి మీర్జా రహ్మత్ బేగ్ ఖాద్రీ పోలీసు స్టేషన్ వద్దకు చేరుకున్నారు. బాధితుని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News